ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తివనపర్తిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: నపర్తి పట్టణంలో శనివారం పలు కార్యక్రమాల్లో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ముందుగా వనపర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన “తెలంగాణ రుచులు” హోటల్ ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో ఇటువంటి హోటల్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హోటల్ నిర్వాహకులు సర్వేశ్వర్ రెడ్డిని అభినందిస్తూ, అన్నింటికంటే మించిన దానం అన్నదానమేనని, ప్రజలకు నాణ్యమైన మరియు రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం మర్రికుంటలోని మీసాల రామన్న అక్షయ రికార్డింగ్ స్టూడియోలో నాగేంద్ర సాగర్ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై రచించిన పాటను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. తనపై అభిమానంతో మంచి పాటను రచించిన నాగేంద్ర సాగర్ ను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం వనపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. మహేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కదిరే రాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బ్రహ్మంచారి, పెబ్బేరు మండలాధ్యక్షుడు యాపర్ల రామిరెడ్డి, పెబ్బేరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, పట్టణ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!