ePaper
Sunday, November 1, 2026
📄 ePaper

హరీష్ రావు సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 31 2026: పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో నవంబర్ 2న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొననున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. సభ నిర్వహించనున్న ప్రాంగణాన్ని సందర్శించి, సభా ఏర్పాట్లపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… వానాకాలం సాగులో నీరు, విద్యుత్ కొరత కారణంగా పెద్దమందడి మండల పరిధిలోని పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ముందుచూపు, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల నీటి లభ్యత ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో పంటలకు నీరు అందించలేకపోయారని విమర్శించారు. నవంబర్ 2న హరీష్ రావు అల్వాల గ్రామానికి చేరుకుని ఎండిపోయిన వరి పంటలను స్వయంగా పరిశీలించడంతో పాటు బాధిత రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటారని తెలిపారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని రైతులకు భరోసా కల్పిస్తారని, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని డిమాండ్ చేస్తారని పేర్కొన్నారు. సభకు వేలాది మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, నీడ తదితర సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నష్టపోయిన అన్నదాతలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నిరంజన్ రెడ్డి వెంట జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, అల్వాల గ్రామ సర్పంచ్ రాజ మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వేణు యాదవ్, నాయకులు అల్వాల వెంకట్ రెడ్డి, సయ్యద్ జమీల్, సేనాపతి, బాల్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, గౌడ్ నాయక్, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9...

గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి

నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో...

ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధి ప్రదాత దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి 

–  శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్.బాదం వెంకటేశ్వర్లు, పొలిటికల్...

నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు యత్నం.. ముగ్గురి అరెస్ట్

రెండు నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనంపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...

పేదోడి గుడిసెలో వెలుగు నింపాలని కరెంట్ డిపార్ట్మెంట్ ఎడిఇ కి కాలని ప్రజలు వినతిపత్రం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్.9 టివి న్యూస్...

Related Articles

పేదోడి గుడిసెలో వెలుగు నింపాలని కరెంట్ డిపార్ట్మెంట్ ఎడిఇ కి కాలని ప్రజలు వినతిపత్రం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్.9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.01.2026.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ జయప్రకాష్ కాలనీలో బేడ బుడగ జంగాల గుడిసెలో విద్యుత్ ఆపివేతపై...

జిల్లాస్థాయిభజనపొటీలలోముమ్మళ్ళపల్లి గ్రామం శ్రీ గురు హరి భజన మండలి సభ్యులకు ప్రశాంశ పత్రలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.01.2026. వనపర్తి పట్టణంలో జరుగుతున్న వికాస తరంగిణి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచా...

కళాకారులను కాపాదుకుందాం -పలుస శంకర్ గౌడ్

కళాకారుడు జయరామ్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 30 2026:...
error: Content is protected !!