ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్
టి జి ఎస్ డబ్ల్యు ఆర్ ఐ ఈ ఎస్ సమన్వయకర్త రామ కళ్యాణి
జూలై 4, 2026: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి సతీష్
మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ మండలం 2026 – 2027 విద్యా సంవత్సరమునకు గాను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం గ్రూపులలో మిగిలి ఉన్న ఖాళీలను భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ / టి జి ఎస్ డబ్ల్యు ఆర్ ఐ ఈ ఎస్ సమన్వయకర్త రామ కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని బాలుర (బెల్లంపల్లి, సిఓఈ జైపూర్, మంచిర్యాల, కాసిపేట)/ బాలికల (లక్షెట్టిపేట, చెన్నూర్, మందమర్రి, బెల్లంపల్లి) జూనియర్ కళాశాలల యందు ఇంటర్మిడియట్ మొదటి సంవత్సరం గ్రూపులలో అతి కొద్ది ఖాళీలను, బాలికలచే భర్తీ చేయుటకు గాను, బాలికలకు లక్షెట్టిపేట లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, బాలురకు జైపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఈ నెల 6వ తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన బాలికలు ఈ నెల 6వ తేదీ ఉదయం 9 గంటలకు లక్షెట్టిపేటలో, బాలురు జైపూర్ లో తమ అర్హతలను తెలియజేసే ఒరిజినల్ సర్టిఫికెట్లు, నకలు ప్రతులతో హాజరు కావలసి ఉంటుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్, మధ్యాహ్నం 1 గంట తర్వాత మెరిట్ జాబితా ప్రకటన, 2 గంటల తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించి, సీట్లు కేటాయించిన జాబితా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.
అభ్యర్థులు రాష్ట్రంలో మార్చి, 2026 నిర్వహించిన పరీక్షలలో ఒకే ప్రయత్నంలో ఎస్.ఎస్.సి./ సి.బి.ఎస్.ఈ./ ఐ.సి.ఎస్.ఈ. ఉత్తీర్ణులై ఉండాలని, 10వ తరగతిలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన మెరిట్ లో, కుల ప్రాతిపదికన, అడ్మిషన్లు కల్పించడం జరుగుతుందని, అభ్యర్థులు మంచిర్యాల / ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలని, 10వ తరగతిలో తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం కళాశాలలలో దరఖాస్తు చేసుకోవచ్చని, ఒరిజినల్ ఎస్.ఎస్.సి. మార్కుల మెమో ప్రతిని కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాలని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతంలో 1 లక్ష 50 వేల రూపాయల లోపు ఉండాలని, ఇందుకు సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని జనవరి 1, 2026 న / అంతకుముందు తేదీలో తహశీల్దార్ చే జారీ చేయబడి ఉండాలని తెలిపారు. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 31, 2026 నాటికి 17 సంవత్సరాలు మించకూడదని, ఎస్.సి. అభ్యర్థులకు ఒక సంవత్సరం సడలింపు ఉంటుందని, అభ్యర్థులు కేటాయించిన సంస్థలో అడ్మిషన్ పొందే సమయంలో, విద్యార్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ల తో పాటు, సంబంధిత తహశీల్దార్ జారీ చేసిన ఒరిజినల్ కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను సమర్శించాలని, 2026-27 తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల అర్హత పరీక్ష రాసినటువంటి బాల బాలికలకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇదివరకు జోనల్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారు, వివిధ కళాశాలలో దరఖాస్తు సమర్పించిన వారు కూడా స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరుకావాలని, అడ్మిషన్ పొందిన వారు మరుసటి రోజు కళాశాలలో చేరవలసి ఉంటుందని తెలిపారు. ఈ నెల 10వ తేదీ నాటికి ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించని యెడల అడ్మిషన్ రద్దు చేయబడుతుందని తెలిపారు.

