ePaper
Saturday, August 1, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలి

ధర్నాకు దిగిన గ్రామస్తులు

జులై 6 : పొలిటికల్ పవర్ న్యూస్ 9 టీవీ ప్రతినిధి సతీష్

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెం గ్రామంలో రోడ్డు సమస్య ఉందని అధికారులకు నాయకులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు అన్నారు.ఈరోజు ఉదయం వర్షం పడటంతో రోడ్డుపైకి వర్షం నీరు నిలిచిపోయాయి గ్రామస్తులకు రాకపోకలు ఇబ్బందికరంగా మారింది అన్నారు. రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామ ప్రజలు ఈరోజు ఉదయం రోడ్డుపై ధర్నాకు దిగారు.వర్షాకాలం లో స్కూల్ కి పిల్లలు వెళ్లడానికి కానీ, స్కూల్ బస్సులు వెళ్లడానికి పిల్లలకు ఇబ్బందికరంగా ఉందని అధికారులకు పలుసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు.ఇకనైనా రోడ్డు సమస్యను వెంటనే అధికారులు స్థానిక నాయకులు పరిష్కరించాలని ఎమ్మెల్యే నీ గ్రామస్తులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!