ఆన్లైన్ గేమ్లకు అడ్డాగా .మందమర్రి గడ్డ,
ఆర్థికంగా బలహీన పడుతున్న గ్రామీణ బిడ్డలు,
తనిఖీలు చేయండి సార్.. తన్నుకు వస్తాయి గమ్మత్తయిన ఆన్లైన్ కథలు.
అదిలించేవారు లేరు- అదుపు చేసేవారు రానే రారు
(మోకనపల్లి బద్రి)
పొలిటికల్ పవర్ మంచిర్యాల జిల్లా న్యూస్ 9టీవీ ప్రతిని
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గుడిపల్లి, వెంకటపూర్ ,శంకరపల్లి గ్రామాలకు చెందిన కొంతమంది యువకులు ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడి కోట్ల రూపాయలకు పడగలెత్తారు.ఉన్నదంతా పోగొట్టుకొని బికారులుగా మారిన వారున్నారు. ఈ ఆన్లైన్ గేమ్ల తమాషా ప్రతి ఇంటిని ఏదో విధంగా ..ఏదో ఒక కోణంలో ఇప్పటికి ఆర్థిక ఇబ్బందుల పాలు చేస్తూనే ఉంది. రోజుకు ఒక ఇంటికి గాయత్రి బ్యాంకు వాళ్లు వస్తున్నారు. ఏదో ఇంటరాగేషన్ చేస్తూనే ఉన్నారు.తమకు తెలియని ఈ ఆర్థిక వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో ..ఎంతమంది ఈ విపరీత బ్యాంకు బుక్కుల బాగోతంలో బలి కావలసి వస్తుందో అర్థం కాని పరిస్థితి దాపురించింది. ఒక్కొక్క బ్యాంకు అకౌంట్ కి లక్షల రూపాయలు ఎలా ట్రాన్సాక్షన్ అయ్యాయో లబ్ధిదారులకు తెలియనే తెలియదు. ఈ ఆన్లైన్ గేమ్లు ఆడే యువకులు గ్రామాలలో వారికి తెలిసిన బంధువులు ,స్నేహితులు ఇంటి పక్క వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని గేమ్- గేమ్ కు ఒక బ్యాంకు అకౌంట్ ఇస్తూ. . సెంట్రల్ బ్యాంక్ ,బ్యాంక్ ఆఫ్ బరోడా ,యూనియన్ బ్యాంక్ ,ఐడిఎఫ్సి బ్యాంక్ ,గాయత్రి బ్యాంక్ ఇలా తెలిసిన బ్యాంకులన్నింటిలో అమాయక ప్రజలకు పైసల తమాషా చూపి ,ఒక్కొక్కరిపై ఐదైదు బ్యాంకు అకౌంట్ లు ఇప్పించి బలే గేములాడారు. లక్షలాది రూపాయల బ్యాంకు ట్రాన్సాక్షన్ల వల్ల గ్రామాలలోని కొంతమందికి వృద్ధాప్య పింఛన్లు కూడా నిలిపివేయబడ్డాయి. ఈ ఆన్లైన్ గేములు నిలిపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా పోలీస్ అధికారులు ఎన్ని సూచనలు చేసినా.. కొంతమంది గ్రామీణ వాసులు పెడచెవిన పెడుతున్నారు. ఇప్పటికైనా.. పోలీసు అధికారులు ఈ గ్రామాలలో నివసిస్తున్న ప్రజలకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి.ఎన్ని లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ నిర్వహించారు.ప్రస్తుతం బ్యాంకు అధికారుల తాకిడితో నిత్యం ఎంతమంది ఇబ్బందుల పాలవుతున్నారు. అసలు ఆన్లైన్ గేమ్లు ఈ గ్రామాలలో ఆడుతున్నారా..? లేదా ..అనే కోణంలో విచారణ నిర్వహించాలి. మొదట్లో సమాచారం ఇవ్వడానికి గ్రామస్తులు సాసేమీరన్న.. కొంచెం లోతుగా ఆరా తీస్తే ..నిందితుల పేర్లు అవే బయటపడతాయి. నిందితులను శిక్షించాలనే ఉద్దేశమే కాకుండా ఆన్లైన్ గేమ్లు ఆడడం వల్ల ఆర్థికంగా ,మానసికంగా ,శారీరకంగా కుటుంబాలు కుంటుపడతాయి .చివరికి కట్టుకున్న భార్య -పిల్లలు బజార్లో పడే ప్రమాదం లేకపోలేదు. కావున పోలీసు అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ,ఆన్లైన్ గేమ్లకు బలవుతున్న ఈ పల్లె కుటుంబాలను కాపాడవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.


