టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన
11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం ప్రతినిధి తోడేటి ఎల్ల స్వామి
*రాజకీయ కక్ష కాదు* –
*ప్రజా సంక్షేమమే మా లక్ష్యం*
*అల్లర్లు కాదు, – అభివృద్ధి మా ధ్యేయం*
*అవమానం కాదు – అందరి* *గౌరవమే కాంగ్రెస్ విధానం*
తెలంగాణ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు* మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్* ఆదేశాల మేరకు ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలో
తిప్పిరెడ్డి క్రిష్ణ రెడ్డి* ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. కానీ తెలంగాణ శాసనసభ గౌరవాన్ని, రాజ్యాంగం ప్రసాదించిన స్పీకర్ పీఠాన్ని కించపరిచే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించడం సిగ్గుచేటు. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి. అంతేకాదు, ఎర్రవెల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద దళిత సోదరులు నడిచారని పసుపు నీటితో నేలను కడగడం… ఇది కేవలం ఒక వర్గాన్ని అవమానించడం కాదు, డా. బి.ఆర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించడం. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి ఫ్యూడల్, మనువాద పోకడలను తెలంగాణ సమాజం ఎన్నడూ సహించదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడుతుంది. సామాజిక న్యాయమే మా అజెండా. బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా కక్షపూరిత, ఘర్షణ రాజకీయాలు విడిచి ప్రజా సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల ముఖ్య నాయకులు, సర్పంచ్ లు ఉప సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



