టీ షర్ట్లువద్దంటా – టక్కేస్తే చాలంట.
బట్టల వంక చెప్పి భాషకు దూరం చేయడమేంటంటున్న విద్యార్థులు.
మందమర్రి టామ్ కాం భాష శిక్షణ కేంద్రంలో అన్నీ వింతలే నంటగా..
న్యూస్ మందమర్రి:
ఆదివారం జులై 19. పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో రాష్ట్ర బొగ్గు గని, కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి ఆదేశానుసారం సింగరేణి సంస్థ ఆద్వర్యంలో.. నిర్వహిస్తున్న “టామ్ కామ్” జర్మనీ భాష శిక్షణ శిబిరంలో ఇటీవలి కాలంలో చాలా వింతలు చోటు చేసుకుంటున్న అంటున్నారు భాష శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు .మందమర్రి పట్టణంలో జర్మనీ భాష శిక్షణ శిబిరానికి బాధ్యత వహిస్తున్న మేనేజర్ మేడం రోజుకో వింత ఆలోచన చేస్తూ ..విద్యార్థులను పలు ఇబ్బందులకు గురి చేస్తూ .శిక్షణ శిబిరానికి గత మూడు రోజులుగా దూరం చేస్తుంది అంటున్నారు.మందమర్రి మండల మా న్యూస్ ప్రతినిధి విద్యార్థులను వివరణ కోరగా.. వారు ఇలా చెప్పుకొచ్చారు. 1.టీ షర్ట్లు వేసుకొని క్లాస్కు రావద్దంటుంది, 2.టక్కు లేకుండా క్లాస్ కి రావద్దంటూ..3. క్లాస్ కి నిమిషం ఆలస్యమైనా.. గంటల తరబడి క్లాసు బయట వరండాలనే నిలబెడుతూ.. విద్యార్థులకు మంచినీళ్లు ఇవ్వకుండా కాలకృత్యాలు తీర్చుకోకుండా. విద్యార్థుల్ని మానసిక ఆవేదనకు గురి చేస్తుందన్నారు. అసలే ఈ జర్మనీ భాష నేర్చుకునే వాళ్ళు చాలామంది వివాహితులే ,ఏదో ఒకచోట ,ఏదో ఒక పని చేస్తూ .. ఇన్ని రోజులు కుటుంబ పోషణను వెళ్లదీస్తున్న క్రమంలో..అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న నిరుద్యోగులందర్నీ ఉద్యోగస్తులుగా తీర్చిదిద్ది. యువకులందరూ ఆర్థికంగా సంఘంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ.. జర్మనీ దేశంతో ఒప్పందం కుదుర్చుకొని మన రాష్ట్రం నుండి నిరుద్యోగ యువకుల్ని ఆ దేశానికి పంపే ప్రయత్నం చేసి, ప్రభుత్వ ధనం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి జర్మనీ భాష పైన ఉచితంగా శిక్షణ ఇస్తూ. . జర్మనీ భాష నేర్చుకున్న వారికి ఉద్యోగాలు కల్పిస్తుందనే ఆశతో ప్రస్తుతం వారు చేస్తున్న తాత్కాలిక ఉద్యోగాలను నిలిపివేసి ఆర్థిక అదేవిధంగా కుటుంబ భారం మీద పడుతున్న బతుకులు మారుతాయి బాధ తీరుతుందనే చిన్న ఆశతో .. ఎన్నో వ్యయాప్రయాసలకు ఓర్చి క్లాసులకు వస్తుంటే ..రోజుకో కొత్త రూల్స్ తెస్తూ..విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ..ఈ శిక్షణ శిబిరంలో రోజు-రోజుకు ,విద్యార్థులు తగ్గిపోవడానికి కారణం అవుతున్నారు. వీరు ప్రవేశపెట్టే రూల్స్ బాగానే ఉన్నాయి కానీ .. ఆ రూల్స్ కొందరినీ ఇబ్బందుల పాలు చేస్తున్నాయి .గత మూడు రోజులుగా చాలామంది విద్యార్థులు క్లాసులకు దూరమయ్యారు .ఈ విషయాన్ని సింగరేణి జిఎంకు తెలియపరచడానికి సంసిద్ధమవుతున్నారు కూడా.. ఈ విషయంపై ఎమ్మెల్యే పలుమార్లు ఈ శిక్షణ కేంద్ర బాధ్యుల్ని అదిలించినప్పటికీ ..ఆయన మాటలను పెడచెవిన పెడుతూ.. నేను చెప్పిందే వేదం అన్నట్లు ప్రవర్తిస్తూ ..విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం ఎంతవరకు సమంజసం అంటున్నారు.పట్టణ మేధావులు ,విద్యావేత్తలు. పలు రాజకీయ పార్టీల నాయకులు. ఈ విషయాన్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ,ఎంపీ దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా వేడుకుంటున్నారు.


