కాసిపేట్ ముత్యాల పోచమ్మ బోనాల సంబరాలు
గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వానహించారు
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
జులై 19: మంచిర్యాల జిల్లా దండేపెల్లి మండలం కాసిపేట్ గ్రామంలో ముత్యాల పోచమ్మ బోనాలు ఘనంగా జరుపుకున్నారు. కాసిపేట్ గ్రామం లో అన్ని కుల మత బేధాలు లేకుండా అందరూ ముత్యాల పోచమ్మ బోనాలు జరుపుకోవడం ఇదే మొదటి సారి. కాసిపేట్ గ్రామంలో బోనాలు జరుపుకోవడం ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉందని గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్కాకుల వనిత సృజన్, ఉపసర్పంచ్ కుమ్మరి రాజు మరియు మున్నూరు కాపు సంగం ప్రెసిడెంట్ లక్కాకుల గంగన్న మరియు గ్రామస్థులు గ్రామ పెద్దలు అందరూ పాల్గొన్నారు.


