ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeతెలంగాణబెంగళూరు లో నిర్వహించిన 11 వ ఓబీసీ మహాసభకు హాజరైన జాతీయ వడ్డెర సంఘం జాతీయ...

బెంగళూరు లో నిర్వహించిన 11 వ ఓబీసీ మహాసభకు హాజరైన జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు

📰 Generate e-Paper Clip

బీసీ జేఏసీ స్టేట్ కో చైర్మన్ పిట్ల శ్రీధర్ అన్న , రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్ మరియు జాతీయ వడ్డెర సంఘం నాయకులు…….*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు
11వ ఓబిసి జాతీయ మహాసభ బెంగళూరు వేదికగా డాక్టర్ మన్మోహన్ సింగ్ జ్ఞాన జ్యోతి ఆడిటోరియంలో *జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లో ఘనంగా నిర్వహించారు.

*ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ , కర్ణాటక పిసిసి అధ్యక్షులు హరి ప్రసాద్ , కర్ణాటక డిప్యూటీ స్పీకర్ ఉమా శ్రీ , మరియు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు హాజరవడం జరిగింది.*

దేశవ్యాప్తంగా ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాల పైన, దేశ రాజకీయాల పైన మరియు ఓబీసీల యొక్క వివిధ అంశాల పైన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రజా ప్రతినిధులు మరియు వక్తలు చాలా విషయాలను ప్రసంగించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలతో పాటు, జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు (బీసీ జేఏసీ స్టేట్ కో చైర్మన్) పిట్ల శ్రీధర్ అన్న , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్ , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బోధస్ రవి , జాతీయ నాయకులు జెర్పటి రాజు ,గుంజ రమేష్ బాబు , రాష్ట్ర నాయకులు గుంజ అంజనేయులు ,ఉప్పు దయాకర్ ,తన్నీరు చలపతి ,కొడగంటి కృష్ణయ్య , రాజమల్లు , మల్లె నారాయణ , తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!