ePaper
Thursday, August 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభ ఘనంగా

ప్రజా సమస్యలపై సమరశంఖం.. సీపీఐ ప్రజా చైతన్య యాత్రకు ఘన ముగింపు!

 

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ ఆగష్టు 13)

అశ్వారావుపేట లో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభ ఘనంగా జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా హక్కుల పరిరక్షణ, పేదలు, కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపడతామని తెలిపారు.

ప్రజా చైతన్యమే ఉద్యమానికి బలం.. ప్రజా సమస్యల పరిష్కారమే సీపీఐ లక్ష్యం అంటూ సభలో నాయకులు నినదించారు. దీంతో ముగింపు సభ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!