ePaper
Saturday, August 15, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్,

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో

బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి మాజీ ఛైర్పర్సన్ దావా వసంత సురేష్ తో కలిసి విలేకరుల సమావేశం లో మాట్లాడారు.

 

జీవన్ రెడ్డి కి బహిరంగ లేఖ

జీవన్ రెడ్డి  మాట్లాడుతూ…

నిరుపేద వర్గాల కు సామాజిక భద్రత కోసం ఆసరా పెన్షన్ రెండు వందలు ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తో కెసిఆర్ పదింతలు రూ. 2000 లకు పెంచారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పెన్షన్ 2000 నుండి 4000 చేస్తామని, ఆడబిడ్డలకు 2500 ఇస్తామని చెప్పి, కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచి 32 మాసాలు గడుస్తున్న, పెన్షన్ మంజూరు పై నిర్లక్ష్యం వహించారు.

ఆగస్టు 15 నుండి 7 రకాల పెన్షన్ లో వృద్ధాప్య పెన్షన్, బీడి కార్మికుల పెన్షన్ చేర్చలేదు. ప్రాధాన్యత ఇవ్వాల్సిన వృద్ధాప్య పెన్షన్ పట్టించుకోలేదు.

ఆడబిడ్డలకు 2500 పెన్షన్ మాటే లేదు. కేసీఆర్ ప్రత్యేకముగా బీడీ కార్మికులకు పీ ఎఫ్ చెల్లించిన 52 ఏళ్ల తర్వాత వస్తుంది. బీడీ కార్మికులకు తోడు నిలవాలని దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ బీడీ కార్మికులకు 2000 పెన్షన్ ఇచ్చారు.

 

నిరుపేద వర్గాల కుటుంబాలకు అండగా నిలవాలని కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ 50000 నుండి 100000 అందించారు.

 

కెసిఆర్ కళ్యాణ లక్ష్మి శాదిముబ్రాక్ కుల మతాలకు అతీతంగా అమలు చేశారు.

 

కాంగ్రెస్ పార్టీ కళ్యాణ లక్ష్మీ కి అదనంగా తులం బంగారం ఇస్తామని, ఆడబిడ్డలకు 2500 ఇస్తామని ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించారు.

 

రేవంత్ రెడ్డి వృద్ధుల పోషణ నిర్లక్ష్యం చేస్తే శిక్షించే విధము గా తల్లిదండ్రుల సంరక్షణ చట్టం చేశారు.

 

చట్టాన్ని రూపొందించినా రేవంత్ రెడ్డి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు..

ప్రభుత్వం వృద్ధులను కన్నా బిడ్డల్ల చూసుకోవాల్సి ఉండగా వృద్ధుల సంక్షేమం విస్మరిస్తున్న రేవంత్వారెడ్డి కూడా శిక్షారులే.. వృద్ధులు అవ్వలు, తాతలకు పెన్షన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. పెన్షన్ ల పంపిణీ పై చట్టబద్ధత ను ప్రశ్నిస్తే

ప్రభుత్వం అమలు చేయాల్సి ఉండగా, కనీసం కోర్టులో కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు.. ప్రభుత్వ నిర్లక్ష్యం తో కళ్యాణ లక్ష్మీ కార్యక్రమం నిలిచిపోవడం సిగ్గుచేటు. దశాబ్ద కాలంగా అమలు అవుతున్న పథకాన్ని అమలు చేయాలని కనీసం కౌంటర్ దాఖలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కళ్యాణ లక్ష్మి తో కెసిఆర్ ను ప్రతి ఇంట మేన మామ గా భావించారు. ఎవ్వరు ఊహించని విధంగా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి శాదిముబ్రాక్, బీడీ కార్మికుల పెన్షన్ పథకాలు అమలు చేశారు. కేసీఆర్ అమలు చేసిన వృద్ధుల పెన్షన్, కళ్యాణ లక్ష్మి, బీడీ కార్మికుల పెన్షన్ అమలు అవుతున్న పథకాలు కూడా కొనసాగించలేకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ఇస్తామన్న 2500 ఇవ్వడం లేదు. విద్యావంతులు, గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద ప్రజలు పట్టణ ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణ లో ఆడబిడ్డలకు అత్యధికంగా ఉపాధినిస్తున్న బీడీ పరిశ్రమ.  తోబుట్టువు..ఆడబిడ్డ.. కన్న తల్లి లాంటి మహిళల కు పెన్షన్ ఇవ్వకుండా ఉసురు ఎందుకు పోసుకుంటున్నావు అని రేవంత్ రెడ్డి నీ నిలదీశారు. హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు రేవంత్ రెడ్డి పని తీరుకు చెంప పెట్టు.. మహిళలు అంటే రేవంత్ రెడ్డి ఎంత వివక్ష యో తెలుస్తుంది. ముఖ్యమంత్రికి ఏ మాత్రం నైతికత ఉన్నా రాజీనామా చేయాలి.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసును నీరు గార్చారు అని ఆరోపించారు. ప్రభుత్వం పై భారం పడుతుందని సంక్షేమ పథకాలు తగ్గించే కుట్రలో భాగంగా నే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. రేవంత్ రెడ్డి మహిళల ఉసురు పోసుకోవడం మానుకోవాలి… వృద్ధాప్య పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్,ఆడబిడ్డలకు పెన్షన్ తక్షణమే అమలు చేయాలి.. రేవంత్ రెడ్డి కి జ్ఞానోదయం కలగాలి. తక్షణమే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పునరుద్ధరించేలా చర్యలు చేపట్టి, చెంపలు వేసుకోవాలి.  సమావేశంలో

శీలం ప్రవీణ్ కుమార్, వోలమ్ మల్లేశం, గాజుల రాజేందర్, మున్నా, కళ్లేపల్లె దుర్గయ్య, కోరుకంటి రాము, తోట హరీష్, సతీష్ కుమార్, పల్లె రవి ,రాధా కిషన్, గంగా రెడ్డి, పొనగంటి మహేష్, రమేష్ బాబు, బర్కం మల్లేశం, నరేష్ గౌడ్, కచ్చు హరీష్, సాయి, మహేష్ గుండా మధు,మధు,అనిల్, రాజేందర్,శ్రీనివాస్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!