ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 13 2026: పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తిచేసుకున్న లబ్ధిదారుల గృహప్రవేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై నూతన గృహాల్లోకి అడుగుపెడుతున్న లబ్ధిదారులను ఆశీర్వదించి, వారికి నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి, వారు గౌరవంగా జీవించేందుకు సొంత గూడు కల్పిస్తున్నామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరై నూతన గృహాల్లోకి అడుగుపెడుతున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో, ఇబ్బందులతో జీవించాల్సి వచ్చిందని తెలిపారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని హామీలు ఇచ్చినప్పటికీ తమ సమస్యలను పట్టించుకోలేదని, సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా తమకు సొంత ఇల్లు మంజూరు కావడంతో తమ సొంతింటి కల నెరవేరిందని లబ్ధిదారులు తెలిపారు. తమ కుటుంబాలకు సొంత గూడు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, తమ సమస్యను పట్టించుకుని సహకరించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం చేసిన లబ్ధిదారులు, 1పుట్టమాని రజిత – బాలరాజ్, 2శెట్టి జ్యోతి – బస్వరాజ్, 3ఎం. సుజాత – యాదయ్య, 4చిన్నగుంట రామేశ్వరమ్మ ఆంజనేయులు, బుడగ జంగం కృష్ణవేణి – సీతారాములు అమ్మపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఐదుగురు కుటుంబాలకు సొంతింటి కల సాకారం కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం, ఆత్మగౌరవంతో కూడిన జీవనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎంతో ఉపయోగకరంగా మారిందని వారు పేర్కొన్నారు. “ఇల్లు అనేది కేవలం నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి భరోసా, ఆత్మగౌరవం, భవిష్యత్తుకు పునాది. ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నాం” అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాధవి వెంకటేశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు క్యామ నవనీత రాజు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, పెద్దమందడి మండలాధ్యక్షుడు వెంకటస్వామి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐ. సత్యరెడ్డి, గట్టు యాదవ్, శ్రీనివాసులు, బాలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

