ePaper
Thursday, September 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నవాబుపేటలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి

వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన దేవినేని అవినాష్ గారు, తన్నీరు నాగేశ్వరరావు గారు

వైయస్సార్ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమం.. హారతులతో అక్కా చెల్లెమ్మల ఘన స్వాగతం

జగ్గయ్యపేట నియోజకవర్గం/పెనుగంచిప్రోలు మండలం

పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గింజుపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నవాబుపేట గ్రామ ప్రజలు దేవినేని అవినాష్ గారికి, తన్నీరు నాగేశ్వరరావు గారికి అపూర్వమైన ఘన స్వాగతం పలికారు. అక్కా చెల్లెమ్మలు హారతులతో స్వాగతం పలికారు.

అనంతరం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైయస్సార్ స్ఫూర్తితో గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నవాబుపేట గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు స్మరించుకున్నారు.

వైయస్సార్ హయాంలో గ్రామంలో నిర్మించిన ఇళ్లు, మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు, చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు స్వయంగా గ్రామానికి విచ్చేసి ప్రజల సమస్యలను తెలుసుకుని, వారు అడిగిన వెంటనే ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన విషయాన్ని గ్రామ ప్రజలు నేటికీ గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

పేదల సంక్షేమం కోసం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, పేదల అభ్యున్నతికి విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ప్రజలు కొనియాడారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేతగా వైయస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు, స్ఫూర్తితో ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నవాబుపేట గ్రామాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా ప్రతి ఒక్కరూ ఐక్యంగా, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Previous article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!