– రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు మద్దతుగా పలు కార్యక్రమాలను అమలు చేశారు,
–వైఎస్సార్ వర్ధంతిసందర్భంగాఆమహనీయునికి ఘననివాళులుఅర్పించినకాంగ్రెస్,పార్టీనాయకులు,
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్
సెప్టెంబర్.03.2026.బడుగుబలహీనవర్గాలసంక్షేమానికివైఎస్.రాజశేఖరరెడ్డిచేసినసేవలుచిరస్మరణీయమని,ఆయన రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు మద్దతుగా పలు కార్యక్రమాలను అమలు చేశారనికొత్తకోట మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్ అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగతడాక్టర్.వైఎస్.రాజశేఖరరెడ్డివర్ధంతిసందర్భంగా బుధవారం కొత్తకోట బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన చేసినసేవలను కొనియాడారు.ఈ సందర్భంలో కొత్తకోట మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ముఖ్యమంత్రిగా ఆయనఅమలుచేసినసంక్షేమ,అభివృద్ధికార్యక్రమాలు ప్రజలజీవితాల్లోగణనీయమైనమార్పుతీసుకొచ్చాయనిఅన్నారు.వైఎస్సార్.ముఖ్యమంత్రిగాఉన్నసమయంలోఆరోగ్యశ్రీపథకంద్వారాపేదలకుఉచితంగామెరుగైన వైద్యం అందించడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడం,రైతులకుఉచితవిద్యుత్,అందించడం, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకుప్రాధాన్యత ఇవ్వడం, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకుగృహవసతి కల్పించడం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని గుర్తు చేశారు.అలాగే గ్రామీణ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఇందిరమ్మ ఇళ్లు,పావలావడ్డీ,మహిళాస్వయంసహాయకసంఘాలకుప్రోత్సాహంవంటికార్యక్రమాలకుప్రాధాన్యతఇచ్చారని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా వైద్య సేవలుఅందించేందుకు108అత్యవసర సేవలనుఅందుబాటులోకితీసుకురావడంద్వారావైద్యరంగంలోకొత్తమార్పులకుశ్రీకారంచుట్టారనితెలిపారు.రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు మద్దతుగా పలుకార్యక్రమాలనుఅమలుచేశారని,పేదకుటుంబాలకువైద్యం,విద్య,గృహవసతివంటిమౌలికఅవసరాలను ప్రభుత్వబాధ్యతగాభావించిసంక్షేమపాలనకువైఎస్సార్ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారనిఅన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేసినప్రజానాయకుడనిఅన్నారు.ఆయనఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడమే వైఎస్సార్‌కు అందించే నిజమైన నివాళి అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలోకొత్తకోటమండలకాంగ్రెస్,పార్టీఅధ్యక్షుడు నాగరపు బీచుపల్లి యాదవ్, కొత్తకోట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేశీ పెంటన్న యాదవ్, కొత్తకోట మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ పల్లవి కృష్ణరెడ్డి, మదనపురం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్, కొత్తకోట మున్సిపల్ కౌన్సిలర్,ఎన్.జె.బోయేజ్,ఎం.సంజీవులు,ఉపాధ్యక్షులు సలీం ఖాన్, కొత్తకోట మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు తయ్యాబ్,ఆఫీస్, కొండారెడ్డి, కురుమూర్తి దేవస్థానం డైరెక్టర్లు తిరుపతి,మాజీ వార్డు సభ్యులు జె.సుభాష్,కాంగ్రెస్,పార్టీనాయకులుసందవెంకటేష్,నరేందర్ సాగర్, బాదం వెంకటేష్, జెకె. రాజు, శివ కుమార్ రెడ్డి, బాల్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, హరీష్ రెడ్డి, సాయిరాం, పి. శంకర్ యాదవ్, బాబా,బాలరాజు, సాయిరాం యాదవ్, సాయిల్ యాదవ్, బాలరాజ్ గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి, ముంత లక్ష్మయ్య, ముజీబు, బాలరాజ్, యాదయ్య సాగర్, కృష్ణంరాజు , సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.

