భార్యపై అనుమానం, వేధింపులు,చివరకు హత్య,నిందితుడిని అరెస్ట్ చేసిన నెన్నెల పోలీసులు
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలోని నెన్నెల గ్రామంలో 02-09-2026న జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడు తోట మల్లేష్‌ను నెన్నెల పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసు వివరాలను బెల్లంపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ సి.హెచ్. హనూక్ వెల్లడించారు.
మృతురాలు తోట సబిత (38) నిందితుడి భార్య. గత కొంతకాలంగా భార్యపై అనుమానంతో నిందితుడు ఆమెను తరచూ వేధిస్తూ, గొడవపడేవాడని, గతంలో కూడా ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
02-09-2026న మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో నిందితుడు తన భార్య గొంతు నులిమి,అనంతరం ఇంట్లో లభించిన పదునైన వస్తువుతో ఆమె గొంతుపై దాడి చేసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. అనంతరం రక్తపు మరకలు ఉన్న దుస్తులను ఇంట్లోనే వదిలి,దుస్తులు మార్చుకుని అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 04-09-2026 సాయంత్రం నమ్మదగిన సమాచారం మేరకు తాళ్లగురజాల వై-జంక్షన్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు తరలించింది.
నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ సి.హెచ్. హనూక్ అభినందించి ప్రశంసించారు.

