రైతుబీమా బంద్ అయింది!
అన్నదాతకు అండగా ఉన్న రైతుబీమా బంద్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఎనిమిదేళ్లుగా అన్నదాత కుటుంబాలకు అండగా రూ.5 లక్షల భరోసాను నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాన్ని అర్ధాంతరంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధిత రైతు కుటుంబాలు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల దళిత రైతు ఒర్సు రాంచందర్ గత నెల 29న గుండెపోటుతో మృతి ఆయనకు అర ఎకరం భూమి, భార్య, ముగ్గురు పిల్లలు.. అయితే కుటుంబపెద్ద మరణంతో రాంచందర్ మిత్రులు రూ.5 లక్షల రైతుబీమా కోసం స్థానిక ఏఈఓను కలవగా.. రైతుబీమా పథకం ఆగస్టు 14 నుంచి నిలిచిపోయిందని, బీమా క్లెయిమ్ కాదని చెప్పడంతో ఒక్కసారిగా కుంగిపోయిన రాంచందర్ కుటుంబం 2018 ఆగస్టు 15న రైతు బీమా పథకాన్ని ప్రారంభించి.. రైతు పేరిట గుంట వ్యవసాయ భూమి ఉన్నా, రైతుబీమా పథకం వర్తింపజేసేలా రూపొందించిన కేసీఆర్ 2018-19 నుంచి 2025-26 వరకు 1,86,363 మంది రైతులు మరణించగా, వారి కుటుంబాలకు మొత్తం రూ.9,107.80 కోట్లు పరిహారంగా అందించిన ప్రభుత్వాలు రైతు బీమా పథకం పరిధిలో సుమారు 42.16 లక్షల మంది రైతుల కోసం ఏటా రూ.1,400 కోట్ల వరకు ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తూ వస్తున్న ప్రభుత్వం

