ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

వైయస్ జగన్ గారిని కలిసిన సింగారెడ్డి కోటిరెడ్డి

మాజీ మంత్రి శ్రీమతి విడదల రజిని గారి వెంట చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి గారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఈరోజు తాడేపల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు.

నాదెండ్ల పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో ఇటీవల అరెస్టై బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన అనంతరం కోటిరెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి గారు ఎదుర్కొంటున్న రాజకీయ వేధింపులు, అక్రమ కేసులు, కేసులో అధికారపక్ష నాయకుల ప్రమేయం, ఆయన కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాజీ మంత్రి శ్రీమతి విడదల రజిని గారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి వివరించారు.

కోటిరెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న పరిస్థితులను జగన్ గారు అడిగి తెలుసుకున్నారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధైర్యపడవద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జగన్ గారు భరోసా ఇచ్చారు. ప్రజల కోసం, పార్టీ కోసం ధైర్యంగా నిలబడాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!