డ్రిప్ పరికరాలతో అధిక దిగుబడులు..ఏపీఎంఐపీ ఎపిడి మురళీమోహన్ రెడ్డి
వేముల న్యూస్::—
రైతులు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న డ్రిప్ పరికరాలను సద్వినియోగం చేసుకుని నీటిని పొదుపు చేయడంతో పాటు అధిక దిగుబడులు సాధించాలని ఏపీఎంఐపీ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ మురళీమోహన్ రెడ్డి గురువారం రైతులకు సూచించారు.వేముల మండలం లోని పలు గ్రామాలల్లో అలాగే చక్రాయపేట లో ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలను ఏపీఎంఐపీ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ మురళీమోహన్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఏపీఎంఐపీ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ 2026–27 ఆర్థిక సంవత్సరానికి మైక్రో ఇరిగేషన్ పథకం కింద డ్రిప్ పరికరాల కోసం రైతులు దరఖాస్తులు చేసుకోవాలని,నీటి కొరతను అధిగమించేందుకు డ్రిప్ విధానం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడంతో పాటు పంటలకు అవసరమైన మేరకు నీరు అందించడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవచ్చన్నారు.ఆధునిక వ్యవసాయంలో ఆటోమేషన్ సదుపాయాలు కీలకంగా మారుతున్నాయని,ప్రభుత్వం రాయితీతో అందిస్తున్న ఆటోమేషన్ పరికరాలను పొందేందుకు రైతులు నమోదు చేసుకోవాలని సూచించారు.రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఐఏవో యేసునాధరెడ్డి సంబంధిత అధికారులు,రైతులు పాల్గొన్నారు.
