ePaper
Friday, September 18, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి

–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్. 19. 2026.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు  సమాన ప్రాధాన్యత ఇచ్చిగెలుపోటములనుసమానంగాస్వీకరిస్తూక్రమశిక్షణ,పట్టుదలతోముందుకుసాగాలని,కొత్తకోటమున్సిపల్ చైర్‌పర్సన్,అరుణాశ్రీనివాసులుఅన్నారు.శుక్రవారం వనపర్తిజిల్లాకొత్తకోటమున్సిపల్,కేంద్రంలోదేవరకద్రశాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి సూచనలమేరకు అండర్‌14,అండర్‌17బాలబాలికలకుమండలస్థాయి క్రీడా పోటీలు, సెలెక్షన్స్‌ను  స్పోర్ట్స్ డేగా ఉత్సాహంగా నిర్వహించారు.మండలంలోనివివిధప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్  పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ఒక మంచి కథ ద్వారా స్ఫూర్తిని అందిస్తూ, విజయం ఒక్కరోజులో రాదని, నిరంతర సాధన, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు.ఓటమిఎదురైనప్పుడునిరుత్సాహపడకుండా, దానిని ఒక పాఠంగా తీసుకుని మరింత కష్టపడి ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు.క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన, క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రతి విద్యార్థి తనప్రతిభనుపూర్తిస్థాయిలోప్రదర్శించిఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాయిదయ్య , కొత్తకోట ఎస్‌ఐ విక్రం రాథోర్ , వైస్ చైర్‌పర్సన్ పల్లవి కృష్ణారెడ్డి , పాఠశాలల సిబ్బంది, ఉపాధ్యాయులు, క్రీడా నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అవసరం

పొలిటికల్ పవర్ ప్రతినిధి: సత్తుపల్లి*సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు,...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కొడుకు కే టి రామారావు బంపర్ ఆఫర్

పొలిటికల్ పవర్ ప్రతినిధి తెలంగాణకేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ రేవంత్...

స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలి

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పిలుపు...

కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించిన ఆదర్శ కుటుంబం జగనన్న దంపతులు

మాజీ ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి కుమారుడి వివాహ ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన...

మండల స్థాయి క్రీడల్లో మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థుల ప్రతిభ

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, సెప్టెంబర్ 18: అశ్వారావుపేటలో 17-09-2026న నిర్వహించిన మండల స్థాయి...

సిఆర్పి 145 అమల్లో ఉన్నా.. కుదునూరు పోడు భూముల్లో మట్టి తరలింపులు?

అడ్డూ అదుపు లేకుండా మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్నాయంటున్న స్థానికులు ఫారెస్ట్, రెవెన్యూ...

Related Articles

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు  సమాన ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి

–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్. 19. 2026.విద్యార్థులు...

ప్రత్యేక అవసరాల పిల్లలకు సమగ్ర విద్య..

రైతులకు మెరుగైన మార్కెట్‌ సేవలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: పెబ్బేరులో నూతన భవిత...

కవి ఉప్పరి తిరుమలేష్‌కు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో సాహిత్య ప్రతిభా...
error: Content is protected !!