ePaper
Friday, September 18, 2026
📄 ePaper

మండల స్థాయి క్రీడల్లో మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థుల ప్రతిభ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, సెప్టెంబర్ 18: అశ్వారావుపేటలో 17-09-2026న నిర్వహించిన మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీల్లో మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించారు. క్రీడా విభాగంలో జూనియర్ స్థాయి కబడ్డీలో ప్రథమ బహుమతి, కోకోలో ప్రథమ బహుమతి, సీనియర్ స్థాయి కోకోలో ద్వితీయ బహుమతి సాధించారు. అలాగే అథ్లెటిక్స్ విభాగంలో జూనియర్ స్థాయి షాట్‌పుట్‌లో ప్రథమ, ద్వితీయ బహుమతులను విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఈ క్రీడా పోటీల్లో పాఠశాల తరఫున మొత్తం 55 మంది విద్యార్థులు పాల్గొనగా, ప్రతిభ కనబరిచిన 21 మంది విద్యార్థులు జోనల్ స్థాయికి ఎంపిక కావడం విశేషం. సీనియర్ విభాగంలో వాలీబాల్‌కు నాగ లక్ష్మణ్, ధనుష్, నవనీత్, కబడ్డీకి మైఖేల్, జయప్రకాష్, మల్లేష్, కోకోకు అశోక్, సన్నీ, ప్రశాంత్, సాత్విక్ ఎంపికయ్యారు. జూనియర్ విభాగంలో వాలీబాల్‌కు రిషి, లక్ష్మణ్ గౌడ్, కబడ్డీకి సాయి చరణ్, లోహిత్, జస్వంత్, వీరేంద్ర, కోకోకు టి. జస్వంత్, ప్రవీణ్, సిహెచ్. జస్వంత్, అరుణోదయ్, నాగబాబు జోనల్ స్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులు మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జోనల్ స్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ. రేణుక రాణి, వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మణ్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. జోనల్ స్థాయిలో కూడా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

Latest Articles

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అవసరం

పొలిటికల్ పవర్ ప్రతినిధి: సత్తుపల్లి*సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు,...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కొడుకు కే టి రామారావు బంపర్ ఆఫర్

పొలిటికల్ పవర్ ప్రతినిధి తెలంగాణకేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ రేవంత్...

స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలి

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పిలుపు...

కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించిన ఆదర్శ కుటుంబం జగనన్న దంపతులు

మాజీ ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి కుమారుడి వివాహ ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన...

ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు...

సిఆర్పి 145 అమల్లో ఉన్నా.. కుదునూరు పోడు భూముల్లో మట్టి తరలింపులు?

అడ్డూ అదుపు లేకుండా మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్నాయంటున్న స్థానికులు ఫారెస్ట్, రెవెన్యూ...

Related Articles

*శ్రీనివాస నగర్ సమస్యపై....కొత్తగూడెం వెళ్ళిన సిపియం జిల్లా నాయకత్వం* పొలిటికల్ పవర్ ప్రతినిధి   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న ఖమ్మం శ్రీనివాసనగర్ టింబర్ డిపోలను,కట్టెల మండెలను నగరం బయటికి తరలించాలి**తెలంగాణ కాలుష్య నియంత్రణ...

యూపీఐ లావాదేవీల పన్నును ఎత్తివేయాలని మాస్ లైన్ ఆందోళన – దిష్టిబొమ్మ దహనం

యూపీఐ పన్ను ప్రజలపై కొత్త బాదుడే - సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్పొలిటికల్ పవర్,దమ్మపేట,సెప్టెంబర్ 17: కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై తీసుకొచ్చిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) పన్నును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్...

మల్కారంలో ఘనంగా శ్రీ గౌరీ గణపతి పూజ మహోత్సవాన్ని జరిపించిన నాగబాబు-సుజాత దంపతులు

పొలిటికల్ పవర్,సెప్టెంబర్ 16: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారంలోని రామాలయం ఆలయం వద్ద శ్రీ గౌరీ గణపతి పూజా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో...
error: Content is protected !!