టిబి హెచ్ఐవి పై విద్యార్థులకు అవగాహన

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
లక్షట్ పేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం టిబి ముక్త భారత్ అభియాన్ లో భాగంగా టిబి హెచ్ఐవి పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టిబి లక్షణాలు నివారణ చికిత్స విధానాలతో పాటు హెచ్ఐవి పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వైద్యులపై ఉన్నత అపోహలను వీడి సరైన అవగాహనతో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సంతోష్ కుమార్, ఐ సి టి సి కౌన్సిలర్ ఆంజనేయులు, సూపర్వైజర్ సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

