ePaper
Sunday, September 27, 2026
📄 ePaper

పామిరెడ్డిపల్లి వైరాగ్యగిరికి మహర్దశ

📰 Generate e-Paper Clip

 

అక్టోబర్ 12 నుంచి గిరిప్రదక్షిణకు శ్రీకారం

వైరాగ్యగిరి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 27 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని మహిమాన్వితమైన శ్రీ వైరాగ్యగిరిశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా సహకరిస్తానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తెలిపారు. ఆదివారం పామిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి వైరాగ్యగిరి చుట్టూ గిరిప్రదక్షిణ కోసం అభివృద్ధి చేసిన మార్గాన్ని పరిశీలించారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్‌తో కలిసి గిరిప్రదక్షిణ మార్గం అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై చర్చించారు. వైరాగ్యగిరి ఆలయానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. అక్టోబర్ 12, 2026న గిరిప్రదక్షిణ మార్గ సంప్రోక్షణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ముందుగానే పరిశీలించారు. వేదపండితుల సూచనలు, గ్రామస్తుల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించాలన్నారు. గిరి ప్రదక్షణ మార్గంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అంశాలపై కూడా దృష్టి సారిస్తామని చెప్పారు. గతంలో కెనాల్ పనులు పూర్తయిన సందర్భంగా వచ్చిన తొలి నీటితో పరమశివుడికి అభిషేకం చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్న ఎమ్మెల్యే, అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం వైరాగ్యగిరిశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అరుణాచలంలో నిర్వహించే గిరిప్రదక్షిణ తరహాలో పామిరెడ్డిపల్లి వైరాగ్యగిరి గిరిప్రదక్షిణ కూడా భక్తజనంతో కళకళలాడేలా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Latest Articles

కలసపాడు మండల ఎస్సై హనుమంతుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా యువ నాయకుడు. నరసింహ…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్పిన్ 9టివి సమగ్ర జాతీయ తెలుగు...

ఆదివాసీ హక్కుల కోసం అక్టోబర్ 5న కలెక్టరేట్ ముట్టడి

కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.. జేఏసీ నాయకుల పిలుపు పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 27:...

కాశినాయన మండలంలో నాడు ‘రెవెన్యూ త్రయం’ ఇష్టారాజ్యం.. నేడు వెలుగులోకి కోట్ల రూపాయల భూ అక్రమాలు ..

................ అప్పటి ఎమ్మార్వో సుదీర్,...ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై...

గుర్రం జాషువా గారి 131వ జయంతోత్సవ పత్రిక విడుదల.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు...

ఘనపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఘనపురం ఖిల్లా...

*డీఎస్పీ భీమ్ రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు..*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్...

Related Articles

ఘనపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఘనపురం ఖిల్లా ట్రెకింగ్ లో పాల్గొన్న శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

వినూత్నంగా మంగయ్య గుడి గణపతి నిమజ్జన శోభాయాత్ర

– రూ.1,75,516.లకు లడ్డూ వేలం పాటలో గ్యాస్ జడలయ్య  దక్కించుకున్నారు. పొలిటికల్.పవర్.సమగ్రజాతీయతెలుగుదినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.  ఈశ్వర్. సెప్టెంబర్. 28. 2026.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని గణపతి నవరాత్రులలోభాగంగామంగయ్యగుడిదేవాలయంలో...

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు...
error: Content is protected !!