ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 

దండేపల్లి పోలీస్ స్టేషన్ లో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు – దాడిలో ముగ్గురికి గాయాలు

 

మంచిర్యాల జిల్లా, దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లపేట గ్రామంలో తేదీ 20.10.2026 న సాయంత్రం సుమారు 5:40 గంటల సమయంలో జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆరుగురు వ్యక్తులపై దండేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.

 

ఫిర్యాదుదారురాలు పేరం రజిత (40), భర్త రాజన్న, తాళ్లపేట గ్రామం, తన సోదరుడు ఆకుల రాజేంద్ర ప్రసాద్ మరియు మేనల్లుడు ఆకుల అకిరానందన్‌తో కలిసి జమ్మికి వెళ్తున్న సమయంలో, వారి పొరుగువారైన నిందితులు ఆకుల కిరణ్, ఆకుల రాజేందర్, ఆకుల సురేష్, ఆకుల విజయ్ వర్ధన్, ముట్టె కుమారస్వామి మరియు ఎర్రం మల్లేష్‌లు వారి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, అసభ్య పదజాలంతో దూషిస్తూ కర్రలతో మరియు చేతులతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ దాడిలో ఆకుల రాజేంద్ర ప్రసాద్, ఆకుల అకిరానందన్‌ల తలలకు గాయాలు కాగా, ఫిర్యాదుదారురాలు పేరం రజిత చేతికి గాయమైనట్లు తెలిపారు. అంతేకాకుండా, నిందితులు వారిని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై దండేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, ఆకుల కిరణ్, ఆకుల సురేష్ మరియు ఆకుల విజయ్ వర్ధన్‌లను ఈ రోజు అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

Latest Articles

తెలంగాణను పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్‌ నేతలకు ఇప్పుడు కరువు గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?

– కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, నేడు...

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

Related Articles

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ అక్టోబర్ 28)గౌడ బజార్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.. కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టిన కౌన్సిలర్...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన తిప్పని శేఖర్ అనే 28 సంవత్సరాల యువకుడు...

error: Content is protected !!