ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

రామగిరి ఖిల్లా ట్రెక్కింగ్ ఛాలెంజ్.. యువతకు ఎంపీ వంశీకృష్ణ పిలుపు

అక్టోబర్ 26: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా:   ఏడు గేట్లు దాటి హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి.. ఫాస్టెస్ట్ టైమ్‌లో పూర్తి చేసిన విజేతకు వన్‌ప్లస్ మొబైల్ ఫోన్ బహుమతి రామగిరి మన ప్రాంతంలోని చారిత్రక వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు రామగిరి ఖిల్లాకు పర్యాటకుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ యువతకు వినూత్న ఛాలెంజ్ విసిరారు.

రామగిరి ఖిల్లాలోని ఏడు గేట్లను దాటుతూ ట్రెక్కింగ్ పూర్తి చేసి, చివరగా హనుమంతుడి ఆలయాన్ని దర్శించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ ప్రయాణాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘హాయ్ వంశీ. ఇట్స్ మీ అంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ట్యాగ్ చేయాలని సూచించారు. ఒక నెలలోపు ఫాస్టెస్ట్ టైమ్‌లో ఛాలెంజ్ పూర్తి చేసిన విజేతకు ప్రత్యేకంగా మొబైల్ ఫోన్ బహుమతిగా అందజేస్తామని ఎంపీ వంశీకృష్ణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.మన ప్రాంతంలో ఎన్నో అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, వారసత్వ కట్టడాలు ఉన్నాయని, వాటిని సందర్శించడం ద్వారా మన చరిత్ర గొప్పతనం తెలుస్తుందని పేర్కొన్నారు. రామగిరి ఖిల్లాను స్వయంగా సందర్శించిన తర్వాత ఈ ప్రాంతంపై తనకు మరింత నమ్మకం, ఆసక్తి పెరిగిందని తెలిపారు. ఇలాంటి చారిత్రక ప్రదేశాలను యువత సందర్శించి, వాటి విశిష్టతను సోషల్ మీడియా ద్వారా మరింత మందికి తెలియజేయాలని ఆకాంక్షించారు. మన ప్రాంతంలోనే ఇంత గొప్ప హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. యువత అందరూ రామగిరి ఖిల్లాను సందర్శించి ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలి. టూరిజాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం” అని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. ట్రెక్కింగ్ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భద్రతా జాగ్రత్తలు పాటించాలని, సురక్షితంగా ఛాలెంజ్ పూర్తి చేయాలని సూచించారు. రామగిరి ఖిల్లా చారిత్రక ప్రాధాన్యతను, పర్యాటక ఆకర్షణను మరింత పెంచేందుకు ఈ వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీ తెలిపారు.

 

Latest Articles

తెలంగాణను పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్‌ నేతలకు ఇప్పుడు కరువు గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?

– కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, నేడు...

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

Related Articles

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ అక్టోబర్ 28)గౌడ బజార్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.. కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టిన కౌన్సిలర్...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన తిప్పని శేఖర్ అనే 28 సంవత్సరాల యువకుడు...

error: Content is protected !!