ePaper
Friday, November 6, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ ఖాతా తెరిచింది.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల ఫలితాలను ప్రకటించారు.

నవంబర్ 6 పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు ఈ రోజు శుక్రవారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ మరి కొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చింది. అక్కడి కాంగ్రెస్ నేత ఎఫెక్ట్ తోనే ఈ ఫలితం వచ్చింది. కాగా.. అక్కడ వైసీపీకి మూడో స్థానంకు పరిమితం కావటంతో ఆసక్తిగా మారింది. చీరాల మున్సిపల్ ఓట్ల లెక్కింపు ఈ రోజు జరుగుతోంది. మురుసు తుఫాను కారణంగా ఈ నెల 3న జరగాల్సిన లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది. చీరాల మున్సిపాలిటీలోని 44 వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 163 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ ఛైర్మన్ అభ్యర్దికి మెజార్టీ వచ్చింది. టీడీపీకి 40, వైసీపీకి 37, కాంగ్రెస్ కు 11 ఓట్లు పోలయ్యాయి. కాగా.. వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో ఆసక్తి కర ఫలితాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పోరు కూటమి- వైసీపీ మధ్య ప్రతిష్ఠాత్మకంగా మారింది. కూటమి ఏకపక్షంగా మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. కాగా.. ఇప్పుడు చీరాలలో కాంగ్రెస్ తొలి విజయం నమోదు చేసుకుంది.

Latest Articles

: దేవనకొండలో ఉత్కంఠ పోరు.. రేపే పత్తికొండ కౌంటింగ్ సెంటర్‌లో అసలైన ఫైట్!

దేవనకొండ/పత్తికొండ:దేవనకొండ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ముగిసిన సమరానికి సంబంధించిన...

ప్రభుత్వ విద్యకు మహర్దశ.. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత.. విద్యాశాఖకు...

ప్రజా వైద్యశాలలో బాలింతను, బాబును పరామర్శించిన ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

Related Articles

: దేవనకొండలో ఉత్కంఠ పోరు.. రేపే పత్తికొండ కౌంటింగ్ సెంటర్‌లో అసలైన ఫైట్!

దేవనకొండ/పత్తికొండ:దేవనకొండ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ముగిసిన సమరానికి సంబంధించిన తుది ఘట్టం సమీపించింది. రేపు పత్తికొండలోని కౌంటింగ్ సెంటర్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుండటంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పతాక...

సైనిక స్కూళ్ల ప్రవేశాలకు బిగ్ నోటిఫికేషన్ విడుదల! నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ షురూ!

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక (గార్ల మండల ప్రతినిధి - మాలోత్ అజయ్ నాయక్):దేశానికి సేవ చేసే సైనికులుగా ఎదిగేందుకు, అత్యుత్తమ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించే సైనిక...

అనంతపురం అభివృద్ధ్యే లక్ష్యం.. అవినీతి, వివాదాలకు దూరంగా ఉండండి: వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి దిశానిర్దేశం! – పదవులు అలంకారం కాదు.. ప్రజలకు సేవ చేసే అవకాశం! –...

పొలిటికల్ పవర్ న్యూస్ 9  / అనంతపురం జిల్లా   కర్నూలు ప్రతినిధి  అంపయ్య ఎం (నవంబర్ 06, 2026):అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికల్లో లభించిన ప్రజా విజయాన్ని పురస్కరించుకుని,...
error: Content is protected !!