పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 06 2026: వనపర్తి పట్టణంలోని ఎస్‌ఎల్‌వీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన చిన్నారి అద్వైత్ మొదటి జన్మదిన వేడుకలకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి అద్వైత్‌ను ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షించారు. వనపర్తి పట్టణ నాలుగో వార్డు కౌన్సిలర్ శరవంద మనవడు అద్వైత్ మొదటి జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. పిల్లల జీవితంలో ప్రత్యేకమైన ఇలాంటి రోజులను వేడుక చేసుకోవడం తల్లిదండ్రులకు పిల్లలపై ఉన్న ప్రేమాభిమానాలను చాటి చెబుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ పట్టణ అధ్యక్షులు కదిరె రాములు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

