అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ
పనులకు భూమిపూజ
పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ నవంబర్ 09)
అశ్వారావుపేట : మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు తూర్పు బజార్లో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, జూపల్లి ప్రమోద్, మున్సిపల్ కమిషనర్ ఈ. దిలీప్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి భూమిపూజ నిర్వహించి పనులను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు రహదారి సౌకర్యంతో పాటు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు చిన్నంశెట్టి సత్యనారాయణ, తుమ్మ రాంబాబు, 4వ వార్డు కౌన్సిలర్ కట్టా సింధుజ, నక్క రాంబాబు, మోర్ల వెంకన్న, కర్నాటి శ్రీను, వలి పాషా, కానూరి మోహన్ రావు, గుడపాటి గోవిందు, ఎస్.కె. ఫకీర్, ఎస్.కె. షరీఫ్, ఎస్.కె. కిషోర్, కట్ట శ్రీనివాసరావు, కట్టా రాంబాబు, ఆరేపల్లి పెద్దోడు, గున్నం కిషోర్, దండా బత్తుల రమేష్, మట్లకుంట కామేష్, ఆరేపల్లి నాగేంద్ర, ఉలవల మురళీకృష్ణ, నల్లబోతుల నాగు, నల్లబోతుల శ్రీను తదితరులు, 4వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో స్థానిక వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


పనులకు భూమిపూజ