అశ్వరావుపేటలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

జూపల్లి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేడుకలు
పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ గణేష్ నవంబర్ 08)
అశ్వరావుపేట: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను అశ్వరావుపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైస్ చైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలతో కార్యక్రమం సందడిగా సాగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

