ePaper
Monday, November 9, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ

 

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ నవంబర్ 09)

 

అశ్వారావుపేట : మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు తూర్పు బజార్‌లో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, జూపల్లి ప్రమోద్, మున్సిపల్ కమిషనర్ ఈ. దిలీప్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి భూమిపూజ నిర్వహించి పనులను లాంఛనంగా ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు రహదారి సౌకర్యంతో పాటు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు చిన్నంశెట్టి సత్యనారాయణ, తుమ్మ రాంబాబు, 4వ వార్డు కౌన్సిలర్ కట్టా సింధుజ, నక్క రాంబాబు, మోర్ల వెంకన్న, కర్నాటి శ్రీను, వలి పాషా, కానూరి మోహన్ రావు, గుడపాటి గోవిందు, ఎస్.కె. ఫకీర్, ఎస్.కె. షరీఫ్, ఎస్.కె. కిషోర్, కట్ట శ్రీనివాసరావు, కట్టా రాంబాబు, ఆరేపల్లి పెద్దోడు, గున్నం కిషోర్, దండా బత్తుల రమేష్, మట్లకుంట కామేష్, ఆరేపల్లి నాగేంద్ర, ఉలవల మురళీకృష్ణ, నల్లబోతుల నాగు, నల్లబోతుల శ్రీను తదితరులు, 4వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

 

అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో స్థానిక వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Latest Articles

రోడ్డు పక్కన  చెత్త డంపింగ్ యార్డు వెదజల్లుతున్న దుర్వాసన

– భీమాకలువప్రక్కనచెత్తడంపింగ్.యార్డ్.ఉండడంతో మాలధారణ ప్రారంభమైన అయ్యప్ప మాల వేసుకునే స్వాములు ఆలయానికి...

టేకులపల్లిలో విజయవంతంగా ‘ప్రజావాణి’.. అర్జీల పరిష్కారానికి అధికారులకు సూచనలు! – ప్రజలు సమస్యల వినతులను సద్వినియోగం చేసుకోవాలి: MPDO శ్రీదేవి

 (పొలిటికల్ పవర్ - టేకులపల్లి ప్రతినిధి: కాకాటి సత్యప్రసాద్):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,...

ఘట్‌కేసర్ విజయపురి కాలనీలో కోతుల సైన్యం కట్టడి కావలెను! – అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. లేదంటే ప్రజల భద్రతకే ముప్పు!

(పొలిటికల్ పవర్ - ఘట్‌కేసర్ ప్రత్యేక ప్రతినిధి):ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకుల,...

అశ్వరావుపేటలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు  జూపల్లి రమేష్ బాబు...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ  పొలిటికల్ పవర్...

Related Articles

సిద్దిక్ నగర్ నగర్ లో అప్పల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్* 

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిశేరిలింగంపల్లి కొండాపూర్ అంజయ్య నగర్...

ఘట్‌కేసర్ విజయపురి కాలనీలో కోతుల సైన్యం కట్టడి కావలెను! – అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. లేదంటే ప్రజల భద్రతకే ముప్పు!

(పొలిటికల్ పవర్ - ఘట్‌కేసర్ ప్రత్యేక ప్రతినిధి):ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకుల, అధికారుల ఉదాసీనత ఏ స్థాయిలో ఉందో ఘట్‌కేసర్ విజయపురి కాలనీ పరిణామాలే స్పష్టం చేస్తున్నాయి. నిత్యం వందలాది నివాసాలతో కళకళలాడే...

అశ్వరావుపేటలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు  జూపల్లి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేడుకలు పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ గణేష్ నవంబర్ 08) అశ్వరావుపేట:...
error: Content is protected !!