ePaper
Thursday, October 29, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

అన్నదాతలకు అధైర్యం వద్దు, 

చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం,

పెబ్బేరు, శ్రీరంగాపురంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక & పిఎన్9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 03 మే 2026: అన్నదాతలు ఎవరు కూడా అధైర్య పడరాదని, వారు సాగుచేసిన వరి, మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శ్రీరంగాపూర్, పెబ్బేరు మార్కెట్ యార్డులో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వారు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలలో విక్రయించవచ్చునని దళారుల మాటలు నమ్మే మోసపోకూడదు అని ఎమ్మెల్యే సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే అన్నదాతలకు ఎలాంటి సమస్యలు రానివ్వకుండా నిర్వాహకులు ప్రత్యేక దృష్టి దృష్టి సారించాలన్నారు. ధాన్యాన్ని విక్రయించిన అన్నదాతల పేర్లను వెంటనే నమోదు చేయాలని వారికి ధాన్యం విక్రయ సొమ్మును వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన వారికి సూచించారు. కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, పెబ్బేరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు, శ్రీరంగాపురం మండల నాయకులు శ్రీహరి రాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

అశ్వారావుపేటలో విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన

స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్...

మున్నేరు నీళ్లపై మౌనమేందుకు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక ప్రతినిధి మాలోత్...

అశ్వారావుపేట మున్సిపాలిటీలో 250 రేషన్ కార్డుల పంపిణీ

మరో 17 మంది లబ్ధిదారులకు కార్డులు అందజేసిన వైస్ చైర్మన్ జూపల్లి...

పాతూరు కూరగాయల మార్కెట్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక &...

Related Articles

వైఎస్సార్‌సీపీ ‘డిజిటల్ బుక్’లో తెలంగాణ పోలీస్ అధికారుల పేర్లు

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారికంగా ప్రారంభించిన...

* టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల యూనియన్ ఎన్నికల సందర్భంగా జూమ్ మీటింగ్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్  టివి  తెలంగాణ స్టేట్ న్యూస్టి జి ఎస్ ఆర్ టి సి యూనియన్ ఎన్నికలు సందర్భం  గురువారం జూమ్...

error: Content is protected !!