ఆయిల్ పామ్ సాగుతో బంగారు భవిష్యత్తు
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 06 మే 2026: తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో రైతు వారంలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రం దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో ఉద్యాన పంటల సాగు – ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పంపుదల – ప్రత్యామ్నాయ పంటల సాగు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. ఈ సందర్బంగా డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… అత్యధిక వంటనూనె దిగుబడి నిచ్చే పంటలలో ఆయిల్ ఫామ్ ప్రధానమైనదని తెలిపారు. ఆయిల్ ఫామ్ ఎక్కువగా మలేషియా దేశంలో పండిస్తారని మలేషియా దేశం భూమధ్యరేఖకు దగ్గర ఉండడంతో ఆ దేశంలో వాతావరణం ఆయిల్ ఫామ్ కు అనుకూలంగా ఉండడంతో ఎక్కువగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. వంట నూనెను అత్యధికంగా ఎగుమతి చేసే దేశం మలేషియా అని తెలిపారు. వంట నూనెను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం భారతదేశం అని తెలిపారు. భారతదేశంలో జనాభా అధికంగా పెరగడంతో ఆయిల్ కొరత ఎక్కువ అవుతుందని అందుకు మనం ఆయిల్ ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి మన దేశం లోనే ఆయిల్ ఫామ్ సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇచ్చి మరి ఆయిల్ ఫామ్ సాగుకు సహకరిస్తుందని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు చెట్లు పెట్టటానికి గుంతలు తీయడం, డ్రిప్ సిస్టం, పంట పండినంక రవాణా సౌకర్యం, పంటకు కావాల్సిన ఎరువులు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలుగా కోకో, జాజికాయ వంటి ఉద్యాన పంటలను సాగు చేయడం ద్వారా రైతులు ఏడాది పొడవునా అధిక, సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చు అని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు చేసిన మూడు సంవత్సరాల తర్వాత పంట వస్తుందని, గెల కోసిన 24 గంటల్లో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీకి తరలించే విధంగా రైతులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని అన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రోత్సహిస్తోంది కాబట్టి రైతులు పంట మారుస్తూ మొక్కజొన్న, పత్తి, ఆముదం, కూరగాయలు సాగు చేసి లాభాలు పొందవచ్చని తెలిపారు. సంకిరెడ్డి పల్లె మరియు బీచ్ పల్లి దగ్గర నూతన ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ లను త్వరలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాల కల్పన చేస్తూ,రైతును రాజును చేయడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ నెంబర్ భవాని రెడ్డి, రిటైర్డ్ వ్యవసాయ అధికారి కృపాకర్ రెడ్డి, వనపర్తి జిల్లా హార్టికల్చర్ అధికారి విజయభాస్కర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి శాస్త్రవేత్త, మోజర్ల ఆర్టికల్చర్ ప్రిన్సిపాల్ వీణ జోషి, కాంగ్రెస్ నాయకులు చెన్నయ్య, బాల్ రాజు, సిరివాటి సురేష్, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గట్టు రాజు, వనపర్తి జిల్లా రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
