ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 

 

 

*ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు… డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు*

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్

హైదరాబాద్: మే07

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసు శాఖకు కీలక సూచనలు జారీ చేశారు. తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. కాన్వాయ్‌ల కోసం గంటల తరబడి వాహనాలను నిలిపివేయడం, ప్రజలను రోడ్లపై ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలను పూర్తిగా నివారించాలని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌పై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలను కూడా ఆపి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సీఎం సూచించారు. ప్రజల పనులకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్ నిర్వహణ ఉండాలని పేర్కొన్నారు.సీఎం ఆదేశాల అనంతరం రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లతో డీజీపీ సీవీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణ, కాన్వాయ్ నిర్వహణ, ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా మార్చేందుకు త్వరలో ప్రత్యేక “ట్రాఫిక్ బ్యూరో” ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్‌లో వాహనాలను అనుమతించే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రద్దీ ప్రాంతాల్లో ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేయాలని సూచించారు.వర్షాకాలం ముందు నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నివారణ చర్యలు చేపట్టాలని, ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ప్రత్యేక అప్రమత్తత పాటించాలని డీజీపీ ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని, శాంతిభద్రతల విభాగం కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

Latest Articles

వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలపై క్షేత్ర సందర్శన

చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాల గుర్తింపు.. రైతులకు శాస్త్రీయ సూచనలు పొలిటికల్...

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:వైరా నియోజకవర్గం జూలూరుపాడులో *బార్బర్స్ డే* సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద చెలగాటం! నిబంధనలకు నీళ్లొదులుతున్న అనధికార వాటర్ బాటిల్స్ వ్యాపారంప్రస్తుత కాలంలో ఎండాకాలం మాత్రమే కాదు, అన్ని కాలాల్లోనూ మంచినీటి అవసరం విపరీతంగా...
error: Content is protected !!