ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 

 

 

*ఈ నెల 13 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షలు!*

హైదరాబాద్:మే 07

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 13 నుంచి 21 వరకు జరగనున్నాయి హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారులు గురువారం రిలీజ్ చేయనున్నారు. తొలుత కాలేజీల లాగిన్ లో పెట్టి రెండు రోజులకు స్టూడెంట్ల వాట్సాప్ లకు పంపించనున్నారు. విద్యార్థులు రిజిస్ట్రేష న్ నెంబర్ తో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసు కోవచ్చని అధికారులు సూచించారు. అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు కోసం మొత్తం 3,97,997 మంది విద్యార్థులు ఫీజులు చెల్లించారు. ఒకేషనల్ విభాగంలో 28,703 మంది విద్యార్థులు ఫీజులు చెల్లించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పరీక్షలకు సంబంధిం చిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి మే 21 వరకు ప్రతి రోజూ రెండు సెషన్లలో జరగనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్నాయి.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!