పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు ఎవరికోసం… తాగునీర్ అందక రైతుల పడిగాపులు…!
ఎత్తిపోతల పథకాలు ఏమయ్యాయి సారూ…?
పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతన్నలు చేసిన పాపమేంటి..,,?
శేరిలింగంపల్లి మే 12 పొలిటికల్ పవర్ న్యూస్ ప్రతినిధి. (కే.బి.రాజు) హైదరాబాదు నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. నాగర్‌కర్నూలు జిల్లా, కొల్లాపూర్ మండలం లోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుండి నీటిని తోడి, రంగారెడ్డి జిల్లా, కొందుర్గ్ మండలం, లక్ష్మీదేవిపల్లి వరకూ పంపిస్తారు. వర్షాకాలంలో 60 రోజుల పాటు వరద ఉండే రోజుల్లో రోజుకు 1.5 టి.ఎమ్‌సి చొప్పున మొత్తం 90 టిఎమ్సి నీటిని ఎత్తిపోయాలనేది ప్రాజెక్టు లక్ష్యం.సముద్ర మట్టం నుండి 269.735 మీ. ఎత్తున ఉన్న శ్రీశైలం జలాశయం నుండి 5 అంచెల్లో ఎత్తిపోసి 670 మీ. ఎత్తున ఉన్న లక్ష్మీదేవిపల్లి జలాశయానికి నీటిని చేరుస్తారు. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5 లిఫ్టులు, 6 జలాశయాలూ నిర్మిస్తారు.ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో – మొత్తం నీటిని తరలించడానికి పంపుహౌసులు, జలాశయాలు, పైపులైన్లు, కాలువలు, సొరంగాలు నిర్మించి, తాగునీటి అవసరాలూ, పారిశ్రామిక అవసరాలూ తీర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తారు. రెండవదశలో సాగునీటిని అందించేందుకు అవసరమైన కాలువలు ఇతర సదుపాయాలను నిర్మిస్తారు. పర్యావరణ అనుమతులు.. ఈ పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చాలాకాలంపాటు ప్రయత్నాలు చేసింది. ఈఏసీ సభ్యులు రకరకాల సందేహాల కారణంగా అనుమతుల్ని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను తిరస్కరించిన ఈఏసీ, ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కన పెట్టింది. అప్పుడు ఈఏసీ కోరిన విధంగా సమగ్రంగా ప్రాజెక్టు వివరాలను సమర్పించడంతోపాటు ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను తెలియపరుస్తూ, పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 2023, జూన్ 27న నిర్వహించిన ఈఏసీ 48వ సమావేశంలోనే పాలమూరు ప్రాజెక్టు ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఈఏసీ సభ్యులు పలు అంశాలపై పూర్తి వివరాలను ఇవ్వాలని కోరుతూ అనుమతుల మంజూరును పెండింగ్‌లో పెట్టారు. 2023, జూన్ 24న నిర్వహించిన 49వ ఈఏసీలో మరోసారి ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వాదనలు వినిపించడంతోపాటు పర్యావరణ ప్రభావానికి సంబంధించిన నివేదికలను ఈఏసీకి అందజేశారు. అందులో రెండో దశ అనుమతులు తీసుకోకుండా పనులు చేయడం వల్ల పర్యావరణానికి 153.69 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు, అందుకు నష్ట నివారణ ప్రణాళికతోపాటు సహజ వనరుల పెంపుదల ప్రణాళికల వివరాలును ప్రభుత్వం తెలిపింది.ఆ నివేదికతో ఏకీభవించిన ఈఏసీ, 153.70 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారెంటీని జమచేయడంతోపాటు రూ.106 కోట్ల మేర పెనాల్టీని కట్టాలని షరతులు విధిస్తూ, ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసినట్టు 2023, ఆగస్టు 10న విడుదల చేసిన 49వ ఈఏసీ మినట్స్ లో వెల్లడించింది. డ్రైరన్ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా 2023 సెప్టెంబరు 3న నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద చేపట్టిన మొదటి పంపు డ్రైరన్ విజయవంతమైంది. తొమ్మిది మోటర్లలో మొదటి మోటర్ డ్రైరన్‌ను ఇంజినీర్లు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ రావు దగ్గరుండి పర్యవేక్షించారు.మరికొద్దిరోజుల్లో ఒక పంపు ద్వారా నీళ్లను ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభించి, నిబంధనల ప్రకారం ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్‌ను నింపుతారు. ప్రారంభం.. 2023 సెప్టెంబరు 16న నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ కంప్యూటర్ ద్వారా స్విచ్ ఆన్ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించాడు. నార్లాపూర్ రిజర్వాయర్ డెలివరీ సిస్టర్న్స్ నుంచి అంజనగిరి రిజర్వాయర్‌లోకి వదిలిన కృష్ణమ్మ జలాలకు కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించాడు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖామంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, పి.రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, జి. రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్ లతోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ల ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
