బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని అశ్వారావుపేటలో నిరసన

బాధిత మైనర్ బాలికకు న్యాయం చేయాలని ప్లకార్డులతో ప్రదర్శన
పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట (వడితే గణేష్ మే 13)
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, అశ్వారావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మైనర్ బాలికపై జరిగిన ఘటనలో బండి సాయి భగీరథపై పోక్సో (POCSO) కేసు నమోదైనప్పటికీ, నేటికీ అతడిని అరెస్టు చేయకుండా కాలయాపన చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్‌ను వెంటనే ఆ పదవి నుండి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, చట్టం ముందు అందరూ సమానమేనని, బాధితురాలైన మైనర్ బాలికకు వెంటనే న్యాయం చేయాలని నాయకులు స్పష్టం చేశారు. నిందితుడు ఎంతటి వారైనా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
