*కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి*
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్
*బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై వస్తున్న ఆరోపణలపై నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజాలు రాబట్టాలి. వాస్తవమా? కాదా? వాస్తవమైతే కఠిన చర్యలు తీసుకోవాలి*
టి ఆర్ ఎస్ ( డి) రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ*
“*యాత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః*”
నారీ శక్తి అనే నినాదాలు చేసే బిజెపి ఇప్పుడు బాలికపై జరిగిన దాడి విషయంలో మౌనంగా ఉండడం దేనికి సంకేతం అని టిఆర్ఎస్ (డి) అధ్యక్షులు నరాల సత్యనారాయణ ప్రశ్నించారు
బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై పోక్సో చట్ట ప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మైనర్ల విషయంలో చట్టపరంగా ఇబ్బందులు తప్పవని, చట్టానికి ఎవరు, చుట్టం కాదని, చట్టం తన పని తాను చేసుకు పోతుందని తేల్చి చెప్పారు
బాలిక కుటుంబ సభ్యులను బండి సంజయ్ కుమారుడు బెదిరిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ప్రభుత్వము దృష్టి పెట్టాలని సూచించారు
స్వతంత్ర భారతావనిలో మైనర్ బాలికలపై, మహిళలపై అత్యాచారాలు జరుగుతుండడం చాలా సర్వసాధారణమైపోయిందని ఆయన వాపోయారు.
బండి సంజయ్ కుమారుడు విషయంలో నిజ నిజాలు తేల్చి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని టీఆర్ఎస్ (డి) రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు

