రైలు కిందపడి కానిస్టేబుల్ ఆత్మహత్య.


17
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్. మంచిర్యాల జిల్లా
మందమర్రి : మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ అరవింద్ యాదవ్ మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో గల మూడవ రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
