అంతర్ జిల్లాల దొంగతనం కేసులో పోలీసుల.. అదుపులో కాంగ్రెస్ యువనేత మనం రిపోర్టర్ “పిల్లి రాహుల్” ?

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
*వీరి ముఠా నాయకుడు పాకాలపాటి ధర్మతేజ?*
.*అతని తమ్ముడు మోహన్ రాయ్ కూడా ?*
*చిన్నబీరవల్లిలో పెను సంచలనంగా మారిన సంఘటన*
*రాహుల్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందినీ విక్రమార్క పేరుతో పలు దందాలు❓*
*నందినీ విక్రమార్క పేరుతో నిత్యం ఇసుక దందాలు❓*
*గురువారం రాత్రి అదుపులో తీసుకున్న పోలీసులు*?
*గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన సిపిఎం కార్యకర్త ఎర్రబోయిన నాగేశ్వరరావు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమ్మనేని రమేష్ ప్రధాన అనుచురుడే ఈ పిల్లి రాహుల్
ఇప్పటికైనా ఇలాంటి వారి పట్ల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందినీ విక్రమార్క జాగ్రత్త వహించాల్సి అవసరం ఉంది.
– బోనకల్-
అంతర్ జిల్లాల బంగారం దొంగతనం కేసులో కాంగ్రెస్ యువ నేత పిల్లి రాహుల్, రాహుల్ మేనత్త కుమారుడు దొంగతనాల కేసులో భాగస్వామిగా ఉన్నాడనే సమాచారంతో పాకాలపాటి మోహన్ రాయ్ లను పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మండల పరిధిలోనే చిన్న బీరవల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకోవడంతో సంచలనంగా మారింది. స్థానికులు, విశ్వసినీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి…
మండల పరిధిలోనే చిన్న బీరవల్లి గ్రామానికి చెందిన పాకాలపాటి ధర్మతేజ, పాకాలపాటి మోహన్ రాయ్ అన్నదమ్ములు. ప్రస్తుతం పాకాలపాటి ధర్మతేజ కోదాడ పట్టణంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. పాకాలపాటి మోహన్ రాయ్ ప్రస్తుతం చిన్న బీరవల్లి లోనే నివాసము ఉంటున్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ యువ నేతనని, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని ప్రధాన అనుచరుడుగా చెప్పుకుంటున్న పిల్లి రాహుల్ చిన్న బీరవల్లిలోనే నివాసం ఉంటున్నాడు. మండల పరిధిలోని గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన సిపిఎం కార్యకర్త ఎర్రబోయిన నాగేశ్వరరావు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమ్మనేని రమేష్ ప్రధాన అనుచురుడే ఈ పిల్లి రాహుల్ కావటం విశేషం. అయితే పాకాలపాటి ధర్మ తేజ వివిధ ప్రాంతాలను నివాసాలుగా చేసుకుంటూ తరచూ మారుస్తూ ఉంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కోదాడ పట్టణంలో గత కొన్ని రోజుల క్రితం భారీ బంగారం చోరీ జరిగింది. ఈ చోరీ కేసులో పాకాలపాటి ధర్మ తేజ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ధర్మతేజ కోసం కోదాడ, సూర్యాపేట పోలీసులు రెండు నెలలుగా మూడు టీములుగా ఏర్పడి గాలిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇదే కేసులో చిన్న బీరువల్లి గ్రామానికి చెందిన సోమ సుబ్బారావు కుమారుడు సోమ రావిల్ ను రెండు రోజుల క్రితం కోదాడ, సూర్యాపేట పోలీసులు చిన్న బీరవల్లి లో అర్ధరాత్రి వచ్చి అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం రావిల్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఈ క్రమంలో రావిల్ ఇచ్చిన మేరకు సమాచారం మేరకు పోలీసులు గురువారం అర్ధరాత్రి చిన్న బీరువల్లి లో పిల్లి రాహుల్, మోహన్ రాయ్ ఇళ్లపై దాడులు చేశారు. కట్టుబట్టలతో పిల్లి రాహుల్ ని, పాకాలపాటి మోహన్ రాయ్ లను తీసుకెళ్లారు. ఈ దొంగతనం కేసులో వీరికి ప్రధాన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిసింది. అయితే ఈ దొంగతనానికి ముఠా నాయకుడిగా పాకాలపాటి ధర్మతేజ అని ప్రచారం సాగుతుంది. హైదరాబాద్, చుట్టుపక్కల పలు ప్రాంతాలలో జరిగిన కొన్ని దొంగతనాల కేసులలో వీరు నిందితులుగా ఉన్నట్లు తెలిసింది. పోలీసుల అర్ధరాత్రి వచ్చి అదుపులోకి తీసుకొని తీసుకెళ్లడంతో చిన్న బీరవల్లి గ్రామంలో ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంసముగా మారింది. ఎవరి నోటా విన్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే చర్చ జోరుగా సాగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ యువనేతనని, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని ప్రధాన అనుచరుడనని అంటూ గ్రామంలో పిల్లి రాహుల్ చేయని అరాచకం అంటూ లేదని స్థానికులు అంటున్నారు. కోదాడ, పలు ప్రాంతాలలో జరిగిన బంగారం దొంగతనం కేసులో సుమారు అర కేజీ వరకు ఉంటుందని తెలిసింది. ఈ కేసులో మరి కొంతమంది కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే వీరిని అదుపులో తీసుకున్నది కోదాడ, సూర్యాపేట పోలీసులని తెలుస్తుంది. ఈ విషయంపై బోనకల్ ఎస్సై పొదిలి వెంకన్న ను వివరణ కోరగా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే వారిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నది నిజమేనని తెలిపారు.
