ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

కలెక్టర్ కార్యాలయం లో భారీ అవినీతి తిమింగళం

పొలిటికల్ పవర్ ఎన్ వి ఆర్ టీవీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం లో అసలు ఏం జరుగుతుందో కూడా స్థానిక ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా రెవెన్యూ శాఖలో జరిగే అక్రమాలను నివారించడం ఎవరి తరం అయ్యేలాలేదు ప్రస్తుతం ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఏజెంట్ టు గవర్నమెంట్ కోర్టు నడుపుతున్నారు అట్టి కోర్టుకు కలెక్టర్ ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు అట్టి గవర్నమెంట్ కోర్టులో జరిగే అక్రమాలకు అవినీతికి అంతులేదు వాటిని ప్రశ్నించేవారు కానీ నిలదీసేవారుకానీ ఎవరూ లేరు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వారికి ఏజెన్సీ రూల్స్ మరియు గవర్నమెంట్ కోర్టుపై పూర్తి అవగాహన లేకపోవడం వలన క్రింది సిబ్బంది తయారుచేసిన ఆర్డర్లపై సంతకం చేయడమే వీరి దినచర్యగా మారింది. అసలు ఏజెంట్ టూ గవర్నమెంట్ కోర్ట్ అంటే ఏమిటి……?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ఏజెన్సీ పరిధిలో నివసించే వారికి ఏజెన్సీ ఏరియా లో భూములు ఉన్న ప్రతి ఒక్క ట్రైబల్ నాన్ ట్రైబల్ కి ఏజెన్సీ నియమానిబంధనలు (1/70 చట్టం) సుపరిచితం అలాంటి భూముల యొక్క వివాదములను పరిష్కరించుటకు ఈ యొక్క కోర్ట్ ని సంప్రదించి సాధారణ కోర్టుల మాదిరిగా ఇక్కడ కేసులు వేస్తారు అట్టి కేసులకు సంబంధించి ప్రజలకు బాధితులకు ఎవరికి న్యాయంగా దక్కవలసిన న్యాయం దక్కడం లేదు…

కేసు ఫైల్ చేసిన బాధితులకు న్యాయం జరగాలంటే ఇక్కడ సూపరిండెంట్ గారిని ఖమ్మం వెళ్లి కలవాల్సిందే…??? లేనిచో నీకు (1/70చట్టం ) వర్తించకపోయునా వారసత్వం భూమికి సంబందించి ఎన్ని రకములు డాక్యుమెంట్స్ న్యాయపరంగా అనుకూలంగా ఉన్నా కూడా నీ యొక్క భూమిని వేరే వారికి బాధలయించే ఆర్డర్స్ను తయారు చేస్తారు… అట్టి ఆర్డర్స్ ఫై అవగాహన లేని జిల్లా కలెక్టర్ సంతకం కూడా చేపిస్తారు

దానితో మీ యొక్క కేసు పోయినట్టే ఒక సర్వే ప్రకారం భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఏజెంట్ టు గవర్నమెంట్ కోర్టులో భూములకు సంబంధించి ఇచ్చిన ఆర్డర్స్ లో 75% కేసులు హైకోర్టు లో తప్పుగా తేలినవే

కొత్తగా మేము గమనించినది ఒక కేసులో ట్రాన్స్ఫర్ అయిన జిల్లా కలెక్టర్ గారి సంతకం కూడా ఫోర్జరీ చేసినట్టు

అబియోగాలు వచ్చాయి మరియు అదే విషయమై ప్రస్తుత కలెక్టర్ కి బాధితుడు ఫిర్యాదు చేసినారు కానీ అట్టి పిర్యాదుపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు..

అట్టి ఫిర్యాదులో ఎటువంటి సంబంధంలేని చుంచుపల్లి రెవిన్యూ సర్వేనెంబర్ 161/3 లోని భూమిని అసలు సంబంధం లేని వేరొకరికి కట్టబెట్టే ఆర్డర్ ను ఇచ్చినారు..

ఆర్డర్ చూసి సదరుకేసు పిర్యాదు దారుడు అవాక్కయ్యారు..

అట్టి కేసువిచారణ సందర్బంలోనే గౌరవ జిల్లా కలెక్టర్ 2026 పిబ్రవరి 25 న ట్రాన్స్ఫర్ అయ్యారు అదేరోజు ఏజెంట్ టూ గవర్నమెంట్ కోర్టు సుపేరేండెంట్ వారి స్వాహాస్థలతో వ్రాసి 44 కోర్ట్డ్ ఆర్డర్స్ లు అదేరోజు రిలీజ్ చేసినారు అట్టి 44ఆర్డర్స్ లో బాధితుడికి సంబందించిన ఆర్డర్ లేదు.

కానీ మరుసటి నెల 2026మార్చి 28 న బాధితుని అడ్వాకెట్ ఏజెంట్ టూ గవర్నమెంట్ కోర్ట్ (లీగల్ సెల్ ) ను వేరే పనిపై వెళ్లగా సుపేరేండెంట్ బాధితుని కేసుకు సంబందించిన ఆర్డర్స్ ని ఇచ్చినారు

అట్టి ఆర్డర్స్ గత నెల 2026పిబ్రవరి 25 న పాత కలెక్టర్ ఇచ్చినట్టుగా సంతకం చేసి ఇచ్చినారు

అట్టి ఆర్డర్స్ ని చూసి దిగ్భ్రాంతికి గురి అయిన బాధితుడు

రెవెన్యూ సెక్రటరీకి మరియు ప్రిన్సిపల్ సెక్రెటరీ టు రెవిన్యూ జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం వారికి కి మరియు చీఫ్ సెక్రటరీ తెలంగాణ కి మరియు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది తదుపరి విచారణ చేయగా అట్టి సూపరిండెంట్ గత పదకొండు సంవత్సరాల నుండి ఒకే సీటులో ఉద్యోగిగా పని చేస్తున్నారు మరియు వారి అసిస్టెంట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా కూడా గత ఆరు సంవత్సరాల నుండి అక్కడే పని చేస్తున్నారు

గత ప్రభుత్వం దీర్ఘకాలికంగా పనిచేస్తున్న ఉద్యోగులను మార్చలేకపోయారు కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మూడు సంవత్సరములు ఒకే చోట పని చేస్తున్న వారిని స్థానచలనం చేయాల్సిన అవసరం ఉంది అని భావించి జీవో నెంబర్ ఎం ఎస్ 38 ను విడుదల చేశారు కానీ అందులో ఉన్న చిన్న చిన్న లోతుపాట్లు ఉపయోగించి ఇటువంటి ఉద్యోగులు మరియు మిగతా ఉద్యోగులు మూడు,నాలుగు, ఐదు, సంవత్సరాల నుండి ఒకే దగ్గర పని చేస్తూ సదరు రెవిన్యూ శాఖను బ్రష్టు పట్టిస్తూ ఇప్పటికీ ఉద్యోగం లో కొనసాగుతున్నారు సదరు సూపరిండెంట్ ని గతంలో జూలూరుపాడు లో డిప్యూటీ మండల రెవిన్యూ ఆఫీసర్ గా పనిచేసిన దగ్గర కూడా అక్కడి ప్రజలను ఇదేవిధంగా ఇబ్బంది పెట్టినందుకు అక్కడి ప్రజలు దేహశుద్ధి చేశారు అట్టివారినే గత 11 సంవత్సరాల నుండి ఒకే శాఖలోని ఒకే సిటులో కొనసాగించడం వలన అవినీతికి తావించినట్టే అట్టివారిఫై తగిన విచారణ చేపించి వెంటనే భర్తరప్ చేయాల్సిందిగా ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు

ఇదే విషయమై సదరు బాధితుడు గౌరవ హైకోర్టులో కూడా పిటిషన్ వేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం…

 

బాధితులకు న్యాయం జరిగే వరకు పొలిటికల్ పవర్ అండగా ఉంటుంది.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!