జి.ఎస్.ఆర్ కన్వెన్షన్ హాలు జరిగిన నా బూత్ – నా భవిష్యతు

మే 18
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టి వి తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్
ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాల్గొన్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి * ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ * *ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి *. *మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి
ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు ,సీనియర్ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఎన్నికల సంఘం చేపట్టిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( ఎస్ ఐ ఆర్ )” కార్యక్రమంపై లోతైన చర్చ జరిపి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా *కేటీఆర్ *. మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశమని పేర్కొన్నారు. నగరంలో ఎక్కడా దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఉండకుండా ప్రతి బూత్ స్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేయాలని, అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్ర స్థాయిలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, సవరణలు వంటి ప్రక్రియలను వేగవంతం చేయాలని, యువత, మహిళలు మరియు కొత్తగా అర్హత పొందిన వారిని ప్రత్యేకంగా గుర్తించి నమోదు చేయించాలన్నారు. ఈ దిశగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగా మన ఓటర్ల ఓట్లను తొలగించకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్త వహించాలి.
పదేళ్లపాటు తెలంగాణలో కులం పేరిట, మతం పేరిట మేము ఎన్నడూ చిల్లర రాజకీయాలు చేయలేదు.
గంగా-జమునా తెహజీబ్ సంస్కృతిలా అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకున్నాం.అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా ముందుకు నడిపించాం.కానీ ఇవాళ మన మధ్య విద్వేషాలు రగిలిస్తూ కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలను మనమంతా ఏకమై తిప్పికొట్టాలి.భవిష్యత్తులో హైదరాబాద్, తెలంగాణ బాగుపడాలంటే.. మళ్లీ గులాబీ జెండా ఎగరాల్సిందే! అర్హులైన ప్రజల ఓటు హక్కును కాపాడటంలో ప్రతి బూత్ స్థాయిలో ‘బూత్ లెవెల్ అసిస్టెంట్లు’ (బీ ఎల్ ఏ ఎస్) కీలకంగా వ్యవహరించాలి.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేస్తున్నది కూల్చివేతలే బేటీ బచావో.. బేటీ పఢావో అని ప్రధానమంత్రి మోడీ అంటున్నాడు,ఇలా కేవలం నినాదాలకే పరిమితమైతే.. న్యాయం జరగదు మోడీ . నిష్పాక్షిక విచారణ కోసం బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి. ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం అది తెలంగాణకే కాదు, భారతదేశానికి కూడా అవమానకరం.నగరంలో కనీసం తాగునీటి సరఫరా, దోమల నియంత్రణ వంటి అంశాలను కూడా నిర్వహించలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ కార్యక్రమంలో వారితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
