ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ని గ్రామాలలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ పనులు పట్టించుకోని అధికారులు ప్రశ్నించిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు డప్పు రాజు

 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ గ్రామంలో గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఏర్పడి నుండి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే డ్రైనేజీ లైన్లు మురికి కాలువలు క్లీన్ చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు శానిటేషన్ పనులు పూర్తిగా చేయడం లేదు రాత్రిపూట దోమలు విపరీతంగా కరుస్తున్న గత నాలుగు రోజుల కిందట అధికారులకు చెప్తే ఒక్కరోజు కొట్టడం జరిగింది మళ్లీ ఇప్పటివరకు దోమల మందు కానీ మురికి కాలువలు కానీ గ్రామాల్లో క్లీన్ చేయడం లేదు పారిశుధ్య పనులను పట్టించుకునే వారు లేరు పొద్దున లేస్తే ఇస్నాపూర్ ఆఫీస్ కు వెళ్తున్నామంటూ తిరుగుతున్నారు తప్ప స్ట్రీట్ లైట్లను కూడా పట్టించుకునే వారు లేరు పట్ట పగలు కూడా స్ట్రీట్ లైట్ వెలుగుతూనే ఉన్నాయి. మరియు నాలుగో వార్డ్ లోని బోర్ వాటర్ సంబంధించి ఎస్సీ కమిటీ హాల్ దగ్గర గత నాలుగు నెలల నుండి బోరు పైపులు తీపించి దానిలో ఒక నాలుగు పైపులు తక్కువ వేయడం జరిగింది ఆ నాలుగు పైపులు వేయించి అక్కడ వాటర్ వదిలే వాల్స్ పాడు కావడం జరిగింది ఇప్పటివరకు బోర్ వాటర్ సంబంధించి పట్టించుకునే నాధుడే లేడుమున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తే వాల్సు పంపడం జరిగింది అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు పైపులు వాల్స్ వేయలేదు కావున వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రామ అభివృద్ధికి పారిశుధ్య లోపం లేకుండా అధికారులు స్పందించాలని డప్పు రాజు అధికారులను సూచించారు

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!