ePaper
Friday, September 18, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

తెలంగాణలో జర్నలిస్టులకు శుభవార్త

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్

అక్రిడిటేషన్ కార్డులు భారీగా పెంపు, ఫ్రీలాన్సర్లకు వెసులుబాటు

మీడియా అక్రిడిటేషన్ రూల్స్-2025 సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్ అర్హత చాలు

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మీడియా అక్రిడిటేషన్ కార్డుల సంఖ్యను గణనీయంగా పెంచుతూ, అర్హత నిబంధనలను సడలిస్తూ సమాచార, పౌర సంబంధాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 18.05.2026న మెమో నం. 3419/I&PR/2026-1 జారీ చేసింది.

2.5 లక్షలకు పైగా సర్క్యులేషన్ ఉన్న దినపత్రికలకు రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్, కల్చర్, ఫిల్మ్స్ బీట్‌లకు ఒక్కో ఫోటోగ్రాఫర్ చొప్పున మూడు అదనపు కార్డులు మంజూరు చేయనున్నారు. జిల్లా స్థాయిలో మూడు డెస్క్ జర్నలిస్ట్ కార్డులు అదనంగా ఇస్తారు

 

జిల్లాల్లోని ప్రధాన పర్యాటక, పుణ్యక్షేత్రాల కవరేజ్ కోసం ఒక కరస్పాండెంట్ కార్డు, నల్లమల అటవీ ప్రాంతంలోని దోమలపెంట, మన్ననూరు, అమ్రాబాద్ మండలాల కవరేజ్ కోసం మరో కార్డును పెద్ద పత్రికలకు అదనంగా కేటాయించనున్నారు.

 

75,000 నుంచి 2.5 లక్షల సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు జిల్లా స్థాయిలో రెండు, 25,000 నుంచి 75,000 సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు ఒక డెస్క్ జర్నలిస్ట్ కార్డు చొప్పున పెంచారు. ITDA ప్రధాన కార్యాలయానికి ఒక కార్డు కేటాయించారు.

 

ఫ్రీలాన్స్ కరస్పాండెంట్లు, ఫోటోగ్రాఫర్లు, కార్టూనిస్టులు దరఖాస్తుకు ముందు సంవత్సరంలో పెద్ద లేదా మీడియం దినపత్రికల్లో సొంత పేరుతో కనీసం 12 ఆర్టికల్స్/ఫోటోలు/కార్టూన్లు ప్రచురితమైతే అక్రిడిటేషన్‌కు అర్హులు. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే ఫ్రీలాన్స్ వీడియో జర్నలిస్టులు శాటిలైట్ ఛానెళ్లలో ప్రసారమైన 12 వీడియో క్లిప్పింగ్స్ లింకులు సమర్పిస్తే చాలు.

 

నియోజకవర్గ, మండల స్థాయి కరస్పాండెంట్లుగా అక్రిడిటేషన్ పొందడానికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత లేదా జర్నలిజంలో రెండేళ్ల వృత్తిపరమైన అనుభవం ఉంటే సరిపోతుందని నిబంధన సడలించారు.

జర్నలిస్ట్ యూనియన్ల విజ్ఞప్తుల మేరకు, గౌరవ సమాచార శాఖ మంత్రితో స్పెషల్ కమిషనర్, I&PR జరిపిన చర్చల అనంతరం ఈ ప్రతిపాదనలు రూపొందించారు. 16.05.2026న స్పెషల్ కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాయగా, మంత్రి ఆమోదంతో 18.05.2026న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ (SMAC) ఫిబ్రవరి నుంచి మే వరకు ఐదుసార్లు సమావేశమై ఈ అంశంపై చర్చించింది.

 

ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించి స్పెషల్ కమిషనర్, I&PR డిపార్ట్‌మెంట్ తదుపరి చర్యలు తీసుకోనున్నారు. SMAC, DMAC ద్వారా కొత్త నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ కానున్నాయి.

Latest Articles

గిరిజన భూములపై రాజకీయ తోడేళ్ల కళ్ళు

✓ పేదరికంలో మగ్గుతున్న ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి.✓ పత్రాలు,...

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం...

*కుర్లి శివా రెడ్డి గారి స్వగృహం నందు తేనేటి విందులో పాల్గొన్న...

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5...

పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లిగ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితి 47...

Related Articles

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం తండా నందు సోషల్ మీడియా కన్వినర్  అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి. ఎస్ మక్బూల్ ఈ కార్యక్రమంలో...

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కృషితో చెన్నాపురం చెరువులో గణేష్ నిమర్జనం ప్రారంభం.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.           మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. కీసర సర్కిల్...

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట / పొలిటికల్ పవర్, సెప్టెంబర్16:దగాపడ్డ నేల విముక్తి కోసం, వెట్టిచాకిరీ సంకెళ్లు తెంచేందుకు ‘భూమి కోసం.. భుక్తి కోసం’ ఉవ్వెత్తున...
error: Content is protected !!