ePaper
Saturday, June 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

జగన్ ను జైలుకు పంపండి అని

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ప‌వ‌న్‌ అడిగాడు!

పొలిటికల్ పవర్ పి యన్ నైన్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

 

*జగన్ తో అనవసరంగా*

*ఎందుకు శత్రుత్వం పెంచుకుంటావ్*

*అని అమిత్ షా సలహా ఇచ్చాడు!*

 

ఈ విషయం పవన్ చెప్పమంటే

నాదెండ్ల మనోహర్ కోర్ కమిటీలో చెప్పాడు

కోర్ కమిటీ నుంచే నాకు సమాచారం వచ్చింది

-ప్రొఫెసర్ నాగేశ్వర్

 

ఇది కొత్తేమి కాదు

 

2014 -19 మధ్య

అప్పటి సీఎం బాబు

ఎప్పుడు ఢిల్లీ వెళ్లి మోడీని కలిసినా

రాష్ట్ర సమస్యల గురించి కాకుండా

జగన్ ను అరెస్ట్ చేసి జైలు లో వేయండి

అని మొత్తుకొనేవాడు ….అని నాటి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయిన

సోము వీర్రాజు ,కన్నా లక్ష్మీనారాయణ

(ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ) మీడియా ముందు

చెప్పిన వీడియోలు ఉన్నాయి

 

కానీ బీజేపీ వాళ్ళు

కాంగ్రెస్ చేసిన తప్పు ఎన్నడూ చేయలేదు

 

కాంగ్రెస్ నుంచి జగన్ బయటికి వచ్చాక

సోనియా బాబు తో చేతులు కలిపి కేసులు పెట్టి వేధించింది

అని ఇండియా టుడే రాసింది

 

నిజంగానే టీడీపీ కి చెందిన ఎర్రం నాయుడు

అశోక్ గజాపతిరాజు కాంగ్రెస్ తో కలసి జగన్ మీద కేసులు వేశారు

 

సరే ఆ తరువాత కాంగ్రెస్ కు ఏ గతి పట్టిందో

వరుసగా 3 వ సారి (2014 ,2019 ,2024 )

ఎందుకు ఒడుతోందో తెలిసిందే

 

నాడు కాంగ్రెస్ అండ్ బాబు అయినా

నేడు పవన్ అయినా ఒంటరిగా జగన్ ను ఎదుర్కోలేం

కాబట్టి పొత్తులు పెట్టుకొని ఇంకా సరిపోక

కుదిరితే జగన్ ను జైలు లో పెట్టడం తప్ప

మనకు మరో మార్గం లేదు అని ఫిక్స్ అయిపోయారు

 

కాంగ్రెస్ చేసింది ఏంటి

 

వై యస్ చనిపోయాక ….

మల్లు బట్టి విక్రమార్క (తెలంగాణ డీసీఎం ),

రఘవీరా రెడ్డి (యాదవ్ ) లాంటి వాళ్ళు

జగన్ కు తెలియకుండా

(అని చెప్పిన వీడియోలు ఉన్నాయి ) ..

జగన్ సీఎం అయితే బాగుంటుంది అని

150 మంది ఎమ్మెల్యే ల చేత సంతకాలు పెట్టి

సోనియా కు ఇచ్చారు

 

అయినా

జగన్ ఒక సాధారణ ఎంపీ గానే

కాంగ్రెస్ లో ఉండీపోయాడు

 

(వై యస్ ఆర్ చనిపోగానే అధికారం లో ఉన్న

కాంగ్రెస్ పెద్దలతో టచ్ వెళ్ళిపోయాడు బాబు

అని కాంగ్రెస్ ప్రముఖుడు నాతొ చెప్పాడు

-గతం లో ప్రొఫెసర్ నాగేశ్వర్ )

 

కాంగ్రెస్ లో ఉన్న రేణుక చౌదరి చేత

బాబు సోనియా కు చాడీలు చెప్పించి

పొమ్మనకుండ పొగబెడితే

 

ఎంపీ పదవికి జగన్

ఎమ్మెల్యే పదవికి విజయమ్మ రాజీనామా చేసి

కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లి వేరే పార్టీ పెట్టుకున్నారు కానీ

బాబు టీడీపీ లాగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేయలేదు జగన్

 

ఇన్ని విలువలు పాటించినా..

పార్టీ నుంచి బయటికి పోతాడా అయ్ అని

బాబుతో చేతులు కలిపి సోనియా జగన్ ను జైలు లో పెట్టించింది

 

తరువాత కాంగ్రెస్ నేటికీ కోలుకోలేదు

 

10 ఏళ్ల తరువాత కాంగ్రెస్ తెలంగాణాలో గెలిచింది

కాంగ్రెస్ ఇంకోసారి రాదు అని ఇక్కడ పబ్లిక్ టాక్

కర్ణాటకలో కూడా అంతే

 

అయినా 3 ,4 రాష్టాల్లో

కాంగ్రెస్ ఎప్పుడూ అధికారంలో ఉంటుంది కాబట్టి

అతి పెద్ద ప్రాంతీయ పార్టీలాగ ఉంటుంది

 

ఈ మధ్యనే కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి చెప్పాడు

ఇప్పట్లో కాంగ్రెస్ కేంద్రం లో అధికారం లోకి రాదు అని

 

బాబు అటు బీజేపీ తోనో

కాంగ్రస్ తోనూ టచ్ లో ఉంటాడు

 

నాకు బీజేపీ పెద్దలు తెలుసు

అని గొప్పగా చెప్పుకొనే పవన్ …

రాష్ట్రం బాగు కోసం దాన్ని వాడితే బాగుండేది

కానీ టీడీపీ పొత్తు కోసం, జగన్ ను జైలు వేయమని

చెప్పడం కోసం వాడుకొని అంతిమంగా నష్టపోయేది పవనే

 

నోట్ : బాబు పంపాడో లేక పవనే వెళ్ళాడో

తెలియదు కానీ జగన్ తో ఎదురెదురుగా ఉండి

యుద్ధం చేయలేము అని ఫిక్స్ అయిపోయారు

 

ఈ మొత్తం ఎపిసోడ్ లో

ఆటలో అరటిపండు పవనే

 

నాగరాజు రెడ్డి యర్ర

9848515889

9160591108

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ

ఖమ్మం జిల్లా

తెలంగాణ రాష్ట్రం

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!