యాతాల కుంట టన్నెల్ పనులు పూర్తి

మంత్రి తుమ్మల ప్రత్యేక సమీక్షలతో అధికార యంత్రాంగం అప్రమత్తం….
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ప్రత్యేక కథనం ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి చిరకాల స్వప్నమైన సీతారామ ప్రాజెక్టు పనులను వీలైనంత తొందరగా పూర్తి చేసి జిల్లాకు సాగునీటిని అందించాలని లక్ష్యంతో మంత్రి తుమ్మల తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికే పలుమార్లు సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట వద్ద జరుగుతున్న టన్నాల్ పనులు ను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెలలో యాతాల కుంట వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల వకింత అధికారులపై అసహనం వ్యక్తం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక శాసనసభ్యులతో కోఆర్డినేషన్ చేసుకొని వేగంగా పనులు పూర్తిచేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గం సీతారామ ప్రాజెక్టు నీరు అందించే క్రమంలో యాతాల కుంట వద్ద టన్నెల్ పనులు ఇబ్బందికరంగా ఉన్నాయి.ఈ విషయంపై మంత్రి తుమ్మల స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ టన్నెల్ పనులు ను పరిశీలించారు. ఈ క్రమంలో ఈరోజు దాదాపు యాతాల కుంట వద్ద ప్రధానమైన టన్నెల్ పనులు పూర్తి అయినాయని అధికారులు ధ్రువీకరించారు. గత ప్రభుత్వ హయాములో సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిర్లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సీతారామ పనులు పురోగతి అయ్యేవిధంగా తుమ్మల పలుమార్లు అధికారులకు కీలక సూచన చేశారు. ఎట్టకేలకు యాతాల కుంట వద్ద టన్నెల్ పనులు పూర్తి కావడంతో అశ్వరావుపేట సత్తుపల్లి వైరా నియోజకవర్గాల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి తుమ్మలకు పలువురు రైతులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
