ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఉపాధి హామీ కూలీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఆదుకోవాలి

 

పొలిటికల్ పవర్ పిఎన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్

ఖమ్మం మే 25 పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్

ఉపాధి హామీ కూలీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలంగాణ ఉపాధి హామీ మాజీ డైరెక్టర్, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు దళితరత్న డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఉపాధి హామీ కూలీలకు ఎండా తీవ్రతలు అధికంగా ఉన్నందున వారికి అల్పాహారం మంచినీళ్లు మజ్జిగ ప్యాకెట్లు టెంటు ఏర్పాటు చేయాలని పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ తో వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకొని ఉపాధి కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని తక్షణమే ఇన్సూరెన్స్ పాలసీని ప్రతి ఒక్కరి పేరున హెల్త్ కార్డు లు అందించాలని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలు ఉపాధి కూలీలకు కనీస వేతనం రోజు కి కూలీ 500 రూపాయలు అమలుచేసి పని దినాలు కల్పించాలని పేర్కొన్నారు లేదా మధ్యతరగతి కుటుంబంలో నివసిస్తున్న ప్రతి పేదవారికి జాబ్ కార్డు లు అందించి వారి జీవనోపాధికి ఉపాధి కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీఎంహెచ్డీ నాయకులు ముత్తయ్య వెంకయ్య బాబు వెంకన్న నగేష్ బాబురావు తదితరులు పాల్గొన్నారు

Latest Articles

ముంచుకొస్తున్న జల సంక్షోభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

error: Content is protected !!