ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు*

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులపై అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి..

కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పాలిన్లను ఇతర అవసరమైన ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. రైతుల ధాన్యం భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే వాతావరణ కేంద్రం బలమైన ఈదురుగాలుల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు..

Latest Articles

వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలపై క్షేత్ర సందర్శన

చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాల గుర్తింపు.. రైతులకు శాస్త్రీయ సూచనలు పొలిటికల్...

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:వైరా నియోజకవర్గం జూలూరుపాడులో *బార్బర్స్ డే* సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద చెలగాటం! నిబంధనలకు నీళ్లొదులుతున్న అనధికార వాటర్ బాటిల్స్ వ్యాపారంప్రస్తుత కాలంలో ఎండాకాలం మాత్రమే కాదు, అన్ని కాలాల్లోనూ మంచినీటి అవసరం విపరీతంగా...
error: Content is protected !!