ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

రెండు రోజుల్లో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన హత్య కేసును ఛేదించిన హాజీపూర్ పోలీసులు భార్యతో పాటు నలుగురు నిందితుల అరెస్ట్.

May 28

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన క్రూరమైన సుఫారి హత్య ఘటనకు సంబంధించి, మృతుడు సాయిని కుమార్ (తండ్రి: సత్తయ్య,వయస్సు: 40 సంవత్సరాలు, కులం: మున్నూరుకాపు, వృత్తి:వ్యవసాయం, నివాసం: ఆర్ అండ్ ఆర్ కాలనీ,గుడిపేట గ్రామం,హాజీపూర్ మండలం) మరణంపై అతని తల్లి సాయిని లక్ష్మి (భర్త:సత్తయ్య, వయస్సు:60 సంవత్సరాలు,వృత్తి: వ్యవసాయం, నివాసం:ఆర్ అండ్ ఆర్ కాలనీ,గుడిపేట గ్రామం,హాజీపూర్ మండలం) ఇచ్చిన ఫిర్యాదు మేరకు హాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. ఫిర్యాదులో తన కుమారుడికి రూ.60,000 అప్పుగా ఇచ్చిన రామ్ మల్లేష్‌పై అనుమానం వ్యక్తం చేసింది.

*నిందితుల వివరాలు:*

ఏ-1) రామ్ మల్లేష్, తండ్రి: భీమలింగు, వయస్సు: 40 సంవత్సరాలు,కులం: మాల,వృత్తి:కూలీ, నివాసం:గుడిపేట గ్రామం,హాజీపూర్ మండలం.

(మృతుడిని హత్య చేసిన వ్యక్తి)

ఏ-2) శ్రీరామ్ కుమార్, నివాసం:ఎల్‌ఐసీ కాలనీ,మంచిర్యాల.

(మృతుడిని హత్య చేసిన వ్యక్తి)

ఏ-3) సాయిని భారతి, భర్త:కుమార్, వయస్సు:36 సంవత్సరాలు,కులం: మున్నూరుకాపు, వృత్తి: గృహిణి, నివాసం:గుడిపేట గ్రామం,హాజీపూర్ మండలం.

(మృతుడి భార్య)

ఏ-4) లగిశెట్టి సురేందర్,తండ్రి: రామకృష్ణయ్య, వయస్సు:45 సంవత్సరాలు,కులం: పెరిక,వృత్తి: వ్యాపారం,నివాసం: ఆర్ అండ్ ఆర్ కాలనీ, గుడిపేట గ్రామం.

(మృతుడి భార్యతో అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి)

 

కేసు వివరాలు:

 

మృతుడి భార్య సాయిని భారతి (ఏ-3)కి గుడిపేట గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్ (ఏ-4)తో అక్రమ సంబంధం ఉంది.ఈ విషయం మృతుడు సాయిని కుమార్‌కు తెలిసి,మద్యానికి బానిసై ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను హింసించేవాడు. మృతుడు అధికంగా మద్యం సేవించడం వల్ల అప్పులు పెరిగి, గుడిపేట గ్రామానికే చెందిన రామ్ మల్లేష్ (ఏ-1) వద్ద రూ.60,000 అప్పుగా తీసుకున్నాడు. అయితే అప్పు తిరిగి చెల్లించకపోవడంతో మల్లేష్ పలుమార్లు ఇంటికి వెళ్లి డబ్బులు అడిగి గొడవ చేశాడు. అప్పు చెల్లించకపోతే మృతుడిని చంపేస్తానని బెదిరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో మృతుడి భార్య భారతి (ఏ-3)కి మల్లేష్‌తో పరిచయం ఏర్పడింది.మృతుడు ప్రతిరోజూ మద్యం సేవించి అక్రమ సంబంధం విషయంలో భార్యను హింసించడంతో, అతడిని హత్య చేస్తే తమ అక్రమ సంబంధానికి అడ్డంకి తొలగిపోతుందని భావించి భారతి, సురేందర్ కలిసి పథకం రచించారు.అనంతరం మృతుడి పేరిట పలు జీవిత బీమా పాలసీలు తీసుకుని, రామ్ మల్లేష్ (ఏ-1)తో రూ.10,00,000కు ఒప్పందం కుదుర్చుకుని,2026 ఏప్రిల్ నెలలో రూ.2,00,000 ముందస్తుగా చెల్లించారు.మల్లేష్ ఒక్కడే హత్య చేయలేనని భావించి, శ్రీరామ్ కుమార్‌ను సహకారానికి ఒప్పించాడు.

పథకం ప్రకారం 22-05-2026 రాత్రి ముల్కల్ల గ్రామ శివారులో మృతుడికి అధిక మోతాదులో మద్యం తాగించి, ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి హత్య చేశారు.అనంతరం ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని, మోటార్ సైకిల్‌ను రోడ్డుపై పడవేసి పరారయ్యారు.

 

ఏ-1 వద్ద స్వాధీనం చేసుకున్న వస్తువులు:

 

1. ఏపీ01ఎస్8151 హీరో హోండా స్ప్లెండర్ మోటార్ సైకిల్

2. ఒప్పో కంపెనీ పోకో మొబైల్ ఫోన్

3. నగదు రూ.25,000 (రూ.500 నోట్ల 25 కట్టలు)

4. వెదురు కర్రతో కూడిన ఇనుప సుత్తి

5. నీరు ఉన్న రెండు లీటర్ల శీతల పానీయాల సీసా

6. మూడు ప్లాస్టిక్ గ్లాసులు

 

ఏ-3 వద్ద స్వాధీనం చేసుకున్న పత్రాలు:

 

1. ఎల్‌ఐసీ ఎండోవ్మెంట్ పాలసీ నెం.737820251 – బీమా మొత్తం రూ.5,00,000

2. ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీ నెం.739154808 – బీమా మొత్తం రూ.10,00,000

3. ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ నెం.44361027548 – బీమా మొత్తం రూ.40,00,000

4. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నెం.3W393130002 – బీమా మొత్తం రూ.24,00,000

(పై అన్ని పాలసీలు మృతుడు సాయిని కుమార్ పేరిట తీసుకున్నవి)

5. ఒప్పో కంపెనీ ఎఫ్15 మొబైల్ ఫోన్

 

ఏ-5 వద్ద స్వాధీనం చేసుకున్న వస్తువులు:

 

1. ఆపిల్ ఐఫోన్-15 మొబైల్ ఫోన్

2. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నెం.NN012508156366

(మృతుడు సాయిని కుమార్ పేరిట బీమా చేయబడినది)

 

ఫిర్యాదు అందిన వెంటనే వేగవంతమైన దర్యాప్తు చేపట్టి, సాంకేతిక పరిజ్ఞానం, ఖచ్చితమైన నిఘా ఆధారంగా అతి తక్కువ సమయంలోనే హత్య కేసును ఛేదించిన మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ పర్యవేక్షణలో పనిచేసిన పరిశోధనాధికారి జి. రవీందర్,ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మంచిర్యాల రూరల్ సర్కిల్‌తో పాటు దర్యాప్తులో సహకరించిన కిరణ్ కుమార్ ఎస్‌ఐ, హాజీపూర్, సదానందం హెడ్ కానిస్టేబుల్, చంద్రశేఖర్ పీసీ, గంగాధర్ పీసీ తదితర సిబ్బందిని అభినందించారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!