ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం.. ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ…

జూన్ 1

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ రంగారెడ్డి జిల్లా రిపోర్టర్ కే. బి రాజు.

ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పెండింగులో పెట్టవద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 129 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించరాదని అధికారులకు స్పష్టం చేశారు.ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు చెందిన (28) దరఖాస్తులు, ఇతర శాఖలకు చెందిన 101దరఖాస్తులు, మొత్తం 129 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జూన్ 2 నుండి జూన్ 12 వరకు నిర్వహించనున్న పర్యావరణ పరిరక్షణ.అటవీ అవగాహన వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది నిర్ణీత సమయానికి హాజరై తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ఒక సమర్థవంతమైన వేదిక. ప్రజల వినతులపై అధికారులు స్పందనాత్మకంగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కారం చూపాలి. అదే విధంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం, పర్యావరణ పరిరక్షణ వారోత్సవాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి (రెవెన్యూ), కిరణ్మయి (లోకల్ బాడీస్), వివిధ శాఖల జిల్లా అధికారులు,కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Latest Articles

కలసపాడు నూతన ఎస్సైగా హనుమంతు

కలసపాడు సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ 9 టీవీ తెలుగు జాతీయ...

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

Related Articles

భూ కబ్జాదారుల ఆక్రమణల్లోనే 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

కాశినాయన సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ . తెలుగు సమగ్ర జాతీయ దినపత్రిక  పి ఎన్ 9 టీవీ రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా.శ్రీ అవధూత కాశినాయన మండలంలో రాజకీయ...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 19, 2026:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం, జడ్.పి.హెచ్.ఎస్ సురారం పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి◆ రూ. 900 కోట్ల గురుకుల విద్యాలయాల అక్రమాలపై...
error: Content is protected !!