ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

📰 Generate e-Paper Clip

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//

జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 19, 2026:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం, జడ్.పి.హెచ్.ఎస్ సురారం పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును

జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనినా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగాఈ అవార్డు అందుకున్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. లలిత అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు తదితర ప్రముఖుల సమక్షంలో వెంకటేశ్వర్లు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు.

విద్యార్థుల విద్యాభివృద్ధి, శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యం, విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడం వంటి అంశాల్లో ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డుతో సత్కరించారు.

ఈ సందర్భంగా గంగిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “ఈ అవార్డు నాకు ఎంతో ఆనందాన్ని, మరింత బాధ్యతను కలిగించింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం మరింత అంకితభావంతో పనిచేస్తాను” అని తెలిపారు.

ఈ అవార్డు జెడ్ పి హెచ్ ఎస్ సురారం పాఠశాలకు, మహదేవ్‌పూర్ మండలానికి మరియు మొత్తం జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యా సమాజానికి గర్వకారణంగా నిలిచింది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు ఆనందంగా ఉందన్నారు

Latest Articles

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్ను అకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి సంపత్ రావు

 *పొలిటికల్ పవర్ ప్రతినిధి టేకుమట్ల ఎల్లస్వామి*శనివారం 19...

Related Articles

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఏడు సంవత్సరాల పాపకు అర్జెంటుగా ఏ నెగటివ్ బ్లడ్ కావాలి హైదరాబాద్ దగ్గరలో పరిసర ప్రాంతాల్లో రక్తదాతలు ఉంటేసంప్రదించి రక్త...

భూ కబ్జాదారుల ఆక్రమణల్లోనే 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

కాశినాయన సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ . తెలుగు సమగ్ర జాతీయ దినపత్రిక  పి ఎన్ 9 టీవీ రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా.శ్రీ అవధూత కాశినాయన మండలంలో రాజకీయ...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి◆ రూ. 900 కోట్ల గురుకుల విద్యాలయాల అక్రమాలపై...
error: Content is protected !!