పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం: ఇటీవల మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్, జనంసాక్షి దిన పత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో ఇంఛార్జి కూరకుల గోపీకి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆప్ ఇండియా (డబ్ల్యూజేఐ), తెలంగాణ జర్నలిస్ట్స్ అసోషియేషన్ (టీజేఏ)నేతలు ఘనంగా నివాళులర్పించారు.
శుక్రవారం రఘునాధ పాలెం మండలంలోని గోపి స్వగ్రామం పాపట పల్లి వెళ్ళిన డబ్ల్యూజేఐ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు, (ఎన్.ఎస్.రావు) ఖమ్మం జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్, టీజేఏ జిల్లా అధ్యక్షులు నాగ స్వామి, డబ్ల్యూజేఐ ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్ కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు కట్టేకోల చిన నరసయ్య, మోడెపల్లి కిరణ్, గోగుల నారాయణ రావు, జాబిశెట్టి కుటుంబ రావు, ఏనిగండ్ల శ్రీనివాస రావు, బొడ్డుపల్లి రవీందర్, గోపి మిత్రుడు పసుపులేటి ఉపేందర్ తదితరులు ఆయన చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించారు. గోపి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా యూనియన్ల నేతలు గోపీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన అకాల మరణం జర్నలిస్టు సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.
